Shekhar kammula successfully completed his first schedule
తొలిషెడ్యూల్ పూర్తి ముగించిన శేఖర్‌కమ్ముల…!
‘ఫిదా’ సంచలన విజయం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో -నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె.నారంగ్, పి. రామ్మోహన్ రావు ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ మూవీని నిర్మిస్తున్నారు. హీరోహీరోయిన్లు నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ సీన్‌తో సినిమా షూటింగ్ మొదలైంది.
తొలిసారి ఒక మ్యూజికల్ లవ్ స్టొరీలో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాసని నాగచైతన్య బాగా ఇష్టపడి నేర్చుకున్నారు. అతని పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. సాయిపల్లవి ఈ కథకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. నా సినిమాలలో మ్యూజిక్ బలంగా ఉంటుంది. ఇందులో ఆ బలం మరింత గా కనిపిస్తుంది. రెహ్మాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఈ షెడ్యూలులో కొన్ని సన్నివేశాలను, ఓ పాటను చిత్రీకరించారు. వచ్చే క్రిస్మస్ కి విడుదల చేసేలా ఈ చిత్ర నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్లోనే వచ్చిన ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ పెరిగింది.
డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. నాగచైతన్య కెరీర్లో 20 సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇటీవలే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల.. అంతకు మించిన ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందించనున్నారని తెలుస్తోంది.