Sivakarthikeyan Anudeep Shanthi Talkies SK20 Launched
Sivakarthikeyan, Anudeep KV, SVC LLP, Suresh Productions, Shanthi Talkies #SK20 Launched, Regular Shoot Too Commenced
Versatile actor Sivakarthikeyan collaborates with talented director Anudeep KV for his Tollywood debut. This movie is a bilingual to be made in both Telugu and Tamil languages with Narayan Das Narang, Puskur Ram Mohan Rao and Suresh Babu producing it under the banners of Sree Venkateswara Cinemas LLP, Suresh Productions and Shanthi Talkies. S Thaman scores music for the movie, while Arun Viswa is the co-producer.
Anudeep, who became one of the most sought-after directors, after the blockbuster success of his last directorial Jathi Ratnalu, has readied a winning script for Sivakarthikeyan who is riding high with the success of his last movie Varun Doctor in Telugu.
Marks landmark 20th film of Sivakarthikeyan, #SK20 was launched today with formal ceremony. The makers have also informed to commence the filming of the movie from today. This will be a single stretch schedule that will be shot in Karaikudi and Pondicherry and actor Sathyaraj is also a part of this shooting leg.
#SK20 is touted to be a fun-filled romantic entertainer with a different concept. The film’s story has the backdrops of Pondicherry in India and London in UK. The makers had announced the project on New Year with a glimpse that got tremendous response.
Other cast and crew will be unveiled soon.
Cast: Sivakarthikeyan, Sathyaraj
Technical Crew:
Writer, Director: Anudeep KV
Music Director: S Thaman
Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao and Suresh Babu
Banners: Sree Venkateswara Cinemas LLP, Suresh Productions and Shanthi Talkies
Co-Producer: Arun Viswa
PRO: Vamsi-Shekar
శివకార్తికేయన్, అనుదీప్ KV, SVC LLP, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ #SK20 ప్రారంభం- నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది
బహుముఖ నటుడు శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్విభాషా చిత్రం (తెలుగు తమిళం). ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాత.
తన దర్శకత్వం వహించిన `జాతి రత్నాలు` బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా మారిన అనుదీప్, తెలుగులో తన చివరి చిత్రం వరుణ్ డాక్టర్ విజయంతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కోసం అద్శుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు.
శివకార్తికేయన్ కు ల్యాండ్‌మార్క్ గా వుండే ఈ 20వ చిత్రం, SK20 గా ఈరోజు (గురువారం నాడు) లాంఛనంగా ప్రారంభమైంది. ఈరోజు నుండి సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలియజేసారు. సింగిల్ షెడ్యూల్ గా ఈ సినిమా కరైకుడి, పాండిచ్చేరిలో చిత్రీకరించబడుతోంది. ఈ షూటింగ్ లో నటుడు సత్యరాజ్ కూడా పాల్గొన్నారు.
SK20 లో విభిన్నమైన కాన్సెప్ట్‌తో కూడిన వినోదభరితమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్ర కథ భారతదేశంలోని పాండిచ్చేరి, UKలోని లండన్ నేపథ్యంలో ఉంటుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మాతలు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకటించారు.
ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: శివకార్తికేయన్, సత్యరాజ్
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: అనుదీప్ కె.వి
సంగీత దర్శకుడు: ఎస్ థమన్
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు సురేష్ బాబు
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, సురేష్ ప్రొడక్షన్స్ మరియు శాంతి టాకీస్
సహ నిర్మాత: అరుణ్ విశ్వ
PRO: వంశీ-శేఖర్