SR Kalyanamandapam Movie Stills
ఎస్ ఆర్ కళ్యాణమండపంలో కాలేజ్ స్టూడెంట్ గా నటిస్తున్న కిరణ్ అబ్బవరం
రాజావారు రాణీగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుత పరిణిమాల రీత్య నిలిపివేయడం జరిగింది. అయితే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చే సమయానికి కడప జిల్లా రాయచోటి పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించినట్లుగా యూనిట్ సభ్యలు చెబుతున్నారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కాంబినేషన్ లో ఈ షూటింగ్ జరిగింది. ఈ సినిమాతో శ్రీధర్ గదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతుంది. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.