Suriya’s Aakasam Nee Haddhu Ra New Stills
Suriya’s Aakasam Nee Haddhu Ra Teaser Released
Hero Suriya who has good fame and market value here in Telugu is presently starring in an action thriller Aakasam Nee Haddhu Ra under the direction of Sudha Kongara who delivered a super hit in Telugu with Guru.
Suriya in collaboration with Rajsekar Karpoorasundarapandian, Guneet Monga, Aalif Surti is producing the film under 2D Entertainment & Sikhya Entertainment banners.
The film’s teaser has been released today. The teaser start off with Mohan Babu’s voiceover.
Going by the teaser, Suriya plays a middle classman who dreams to establish his own airlines company. Everybody insults him, as even it wasn’t possible for even Tatas. Based on true story, the film tells the story of of an ordinary man who achieves his dream out of many odds.
Suriya is outstanding and the teaser is gripping thoroughly. Jehovahson Alghar with his BGM gives the thrill feel. Production values are top-notch.
Other actors include Dr. M. Mohan Babu, Paresh Rawal, Aparna Balamurali, Prakash Belawadi and Urvashi. The movie was shot in 60 days in Chennai, Hyderabad, Chattisgarh and Madurai. The film is slated for release in the summer of 2020.
Cast:
Suriya, Dr.M Mohan Babu, Aparna Balamurali, Paresh Rawal, Urvashi, Karunas, Vivek
prasanna, Krishna kumar, Kaali venkat
Crew:
Story & Direction – Sudha Kongara
Music-GV Prakash Kumar
Cinematographer-Niketh Bommi
Art Director- Jacki
Editor-Sathish Suriya
Screenplay-Shalini Usha Devi & Sudha Kongara
Additional Screenplay- Aalif Surti, Ganeshaa
Dialogue-Rakendu Mouli
Maha Theme Lyricst-Pranav Chaganty
Background Score Supervised and edited by- Jehovahson alghar
Programmer-C.Sanjay
Costume Designer- Poornima Ramasamy
Choreography- Shobi, Sekhar VJ
Action Choreography-Greg powell, Vicky
Dolby Atoms Mix-Suren G
Sound Design- Sound Factor Vishnu Govind, Sree Sankar
Sound Effects- ArunSeenu
Make up & Hair- Shyed Malik S
Costumes – Arun
Stills-CH Balu
Visual Promotions-Deepak Bhojraj
Publicity Designer- Gopi Prasannaa
Colorist,DI- Suresh Ravi
VFX Supervisor- Vishwas Savanur
VFX Studios-SilverCloud Studios, Knack Studios
Executive Producers-Achin Jain, Pavithra
Chief Production Controller-B.Senthil Kumar
Pro-Vamsishekar
Co produced by-Rajsekar Karpoorasundarapandian, Guneet Monga, Aalif Surti
Produced by-Suriya
Banner- 2D Entertainment & Sikhya Entertainment
తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి పాపులారిటీ, మార్కెట్ వాల్యూ సంపాదించుకున్న స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘గురు’ వంటి హిట్ మూవీని రూపొందించిన సుధ కొంగర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్, సిఖ్య ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సూర్య, రాజశేఖర్ కర్పూరసుందర పాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ రోజు (మంగళవారం) ‘ఆకాశం నీ హద్దురా’ టీజర్ విడుదలైంది. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలవడం విశేషం. ఈ టీజర్ ప్రకారం సొంతంగా ఒక ఎయిర్‌లైన్స్ కంపెనీ పెట్టాలని కలలుకనే ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా సూర్య కనిపిస్తున్నారు. ఆఖరుకు టాటా వాళ్లకు కూడా సాధ్యం కాని కల కంటున్నావంటూ ప్రతి ఒక్కరూ అతడిని అవమానిస్తుంటారు. ఒక యథార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా.. అనేక అవరోధాల్ని ఎదుర్కొని తను అనుకున్నది సాధించే ఒక సాధారణ వ్యక్తి కథను తెలియజేస్తుంది.
గ్రిప్పింగ్ స్టోరీలైన్‌తో ఈ సినిమా తయారవుతోందని టీజర్‌ని బట్టి అర్థమవుతోంది. మధ్యతరగతి యువకునిగా సూర్య నటన ఈ సినిమాకు హైలైట్ అవుతుందనేది స్పష్టం. జెహోవాసన్ అల్ఘర్ స్వరపరిచిన బీజీయం ఉత్కంఠను కలిగిస్తోంది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంలో డాక్టర్ ఎం. మోహన్‌బాబు, పరేష్ రావల్, అపర్ణా బాలమురళి, ప్రకాష్ బెలవాది, ఊర్వశి, కరుణాస్, వివేక్ కీలక పాత్రధారులు. చెన్నై, హైదరాబాద్, చత్తిస్గడ్, మదురై వంటి లొకేషన్స్‌లో 60 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. 2020 వేసవికి ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సాంకేతిక వర్గం:
స్క్రీన్‌ప్లే: షాలిని ఉషాదేవి, సుధ కొంగర
అడిషనల్ స్క్రీన్‌ప్లే: ఆలిఫ్ సుర్తి, గణేశా
డైలాగ్స్: రాకేందు మౌళి
మహా థీం లిరిసిస్ట్: ప్రణవ్ చాగంటి
సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్
బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్విజన్, ఎడిటింగ్: జెహోవాసన్ అల్ఘర్
సినిమాటొగ్రఫీ: నికేత్ బొమ్మి
ఆర్ట్: జాకి
ఎడిటింగ్: సతీష్ సూర్య
కొరియోగ్రఫీ: శోబి, శేఖర్ వి.జె.
ఫైట్స్: గ్రెగ్ పోవెల్, విక్కీ
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అచిన్ జైన్, పవిత్ర
సహ నిర్మాతలు: రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి
నిర్మాత: సూర్య
బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్, సిఖ్య ఎంటర్టైన్మెంట్
కథ, దర్శకత్వం: సుధ కొంగర