Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao met Jharkhand Chief Minister Hemant Soren

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం కంటే ముందు సీఎం కేసీఆర్ రాంచీలోని గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేశారు