Thaman Interview photos

మామా అల్లుళ్లు ఒకరితో ఒకరు పోటీపడి చేశారు-ఎస్ థమన్
విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న వెంకీమామ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ మీడియాతో మాట్లాడారు.
వెంకీమామ అల వైకుంఠ పురం లో మొత్తం మీదే నడుస్తుంది ఇంకా…..
నాదేమీ లేదు బ్రదర్ మంచి స్క్రిప్ట్ మంచి పాటలు తీసుకుంతుంది అంతే నేను చేస్తున్నావని చాలా మంచి స్క్రిప్ట్ లు.
తొలిప్రేమ సినిమా తర్వాత నుంచి మీ కెరియర్ చాలా ఫాస్ట్ గా వెళుతుంది….
మహానుభావుడు నుండి బ్రదర్ సరైనోడు తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, క్రికెట్ ఆడాను,ట్రావలింగ్ చేసాను.
ఆ తరువాత చల్ మోహన్ రంగ,భాగమతి,అరవిందసమేత అలా…..
క్రిటిసిసం మీరు ఎలా తీసుకుంటారు.?
బ్యాలన్స్ చేసుకుంటా, ట్విటర్ లో అందరికి అందుబాటులో ఉంటా,
అమ్మ తిడితేనే కదా మనకు మంచి పేరు వస్తుంది. వాళ్ళ ట్వీట్ అయితే ఊరికే వెయ్యరు కదా,వాళ్ళను మ్యూజిక్ సంతృప్తి పరుస్తాను.
ఆ ట్వీట్స్ వలన మంచి మ్యూజిక్ వస్తుంది అంటారా.?
మంచి స్క్రిప్ట్స్ వలన మంచి మ్యూజిక్ వస్తోంది, ప్రతిరోజు పండగ రోజు,అల వైకుంఠ పురంలో,వెంకీ మామ ఇవన్నీ మంచి స్క్రిప్ట్ లు బ్రదర్.
వెంకీమామ ఎలాంటి స్క్రిప్ట్.?
వెంకీమామ వెరీ ఏమోషనల్ ఫిల్మ్ అండి,ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు నా కంట్లో తడి వచ్చింది.దాన్ని తీసుకెళ్లి నేను రీ రికార్డింగ్ చేసాను.
కొన్ని సార్లు డైరెక్టర్ చెప్తారు ఇక్కడ సాంగ్ ఉండాలని,మీరు ఎప్పుడైనా కథలో అలా చెప్తారా.?
మేము చెప్పం ఇలాంటి వాటికి డైరెక్టర్ నే ఫాలో అవుతాం,డైరెక్టర్ మాటను అలా ఫాలో అయిపోవడమే మంచిది.
యాక్షన్ ఎపిసోడ్ గురించి ఒక పోస్ట్ పెట్టారు కదా…..
యాక్షన్ ఎపిసోడ్ అయితే వెంకీ గారు కుమ్మేశారు, ఇద్దరూ అలానే చేశారు,మామా అల్లుళ్లు ఒకరితో ఒకరు పోటీపడి చేశారు,బాబీ కూడా అలానే తీసాడు.
మీరో సాంగ్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా.?
ఐ లవ్ రెట్రో సాంగ్స్ డిస్కో రాజా లో కూడా ఒక రెట్రో సాంగ్ చేసాము,బాలు గారు పాడారు.
సాంగ్ కంపోస్ చేసినప్పుడు మీకు తెలుస్తుందా ఇది హిట్ అవుతుందా లేదా అని.?
8000 స్టేజి షోస్ చేసాం, స్టేజి లో ఒక్క సాంగ్ కూడా బ్యాడ్ సాంగ్ పాడరు, ఈ స్టేజి కి వెళ్లిన సరే ముప్పై హిట్ పాటలే పాడుతారు, ఆ స్టేజి లో నుండి నేర్చుకుందే ఒక పాట బోరకొట్టకుండా జనాలకు ఎలా వినిపించాలి అని,అది హిట్ అవుతుందా,అవ్వదా అని అక్కడే డిసైడ్ అవుతోంది.
ఈ సినిమాలో ఎంత ఆర్టిస్టిక్ ఉంది, ఎంత కమర్షియల్ ఉంది.?
ఇది ఎమోషనల్ ఫిల్మ్ బ్రదర్
ఇది ఒక ఎమోషనల్ హిట్ సినిమా చూసిన వాళ్ళ అందరిని కదిలిస్తోందా.
రీమేక్ సాంగ్స్ ఈ మధ్య దూరంగా ఉన్నారు.?
మనకెందుకు అండి,ఆ మ్యూజిక్ డైరెక్టర్ తిట్టుకుంటాడు, లిరిక్ రైటర్ తిట్టుకుంటాడు, సింగర్ తిట్టుకుంటారు, బాలు గారు ఫోన్ చేసి మరీ తిడతారు.
ఇప్పుడు సంక్రాంతి సీజన్ స్టార్ట్ అవుతుంది అందులో మీ సినిమాలు కూడా ఉన్నాయి ఆ హీట్ ఉందా .?
లేదు క్లైమెట్ లానే కెరియర్ కూడా చాలా కూల్ గా ఉంది కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాం అంతే.
సినిమా మీరు చూసి రీ-రికార్డు చేశారు కదా ఫస్ట్ హాఫ్ బాగుంటుందా, సెకండాఫ్ బాగుంటుందా.?
మొత్తం సినిమాగా బాగుంటుంది,
ఫస్ట్ ఎంటర్టైనమెంట్,సెకండాఫ్ ఏమోషన్ అంతే.
అన్ని సినిమాలు ఒకేసారి వస్తున్నాయి కదా ఏమైనా ఒత్తిడి ఫీల్ అయ్యారా.?
ఏమి లేదు బ్రదర్ చాలా హ్యాపీ గా ఉన్న కావలంటే నా బీపీ చెక్ చేసుకోండి.అన్ని కరెక్ట్ ప్లానింగ్ లో చేసుకున్నా.