They disappeared with only one movie

ఒక్కసినిమాతోనే కనుమరుగయ్యారు
సినిమా అంటేనే రంగుల ప్రపంచం… ఇక్కడ టాలెంట్ తోపాటు కాసింత అద్భష్టం కూడా కలిసిరావాలి.. లేదంటే ఎంత అందంగా ఉన్నా సినిమా అవకాశాలు రావు.. అందంలో మోస్తారుగా ఉన్నా లక్కీ హ్యాండ్ అయితే అగ్ర హీరోయిన్ గా ఎదిగిపోవచ్చు. టాలీవుడ్ లో హీరోలు ఎప్పుడూ ఎవర్ గ్రీన్. వారి వయసు పెరుగుతున్నా వారు సినిమాలు చేస్తూనే ఉంటారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ కాలం నుంచి నేటి చిరంజీవి, నాగార్జునుల వరకు హీరోలకు మాత్రం డిమాండ్ బాగానే ఉంటది. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా కాదు… ఓ పదేళ్లు సినిమాలు చేస్తే రిటైర్ అయిపోవాల్సిందే… తెలుగు అగ్ర హీరోలందరితో కలిసి సినిమా చేసిన సిమ్రన్ రిటైర్ అయిపోయింది… కానీ ఆమెతో ఆడి పాడిన బాలయ్య – చిరు – నాగార్జున -వెంకీలు ఇంకా సినిమాలు చేస్తున్నారు. హీరోలకు హీరోయిన్లకు అదే తేడా… ఒక సినిమాతో వెలుగు వెలిగి కనుమరుగైపోయిన హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోనే కనిపించలేదు. అలా ఉన్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం… రాంచరణ్ ఎంట్రీ మూవీతో అడుగుపెట్టిన నేహాశర్మ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక కనుమరుగైపోయింది. పవన్ కళ్యాణ్ బంగారం సినిమా ఎంట్రీ ఇచ్చిన మీరా చోప్రా ఇండస్ట్రీలో హిట్ కాలేక వెనుదిరిగింది. బన్నీ సినిమాలో హీరోయిన్ గౌరీముంజల్ దీ అదే కథ. రవితేజతో కలిసి ‘నేనింతే’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సియా అయితే ఆ సినిమాతోనే క్లోజ్ అయిపోయింది. మళ్లీ సినిమాలు చేయలేదు. ఇక పంజా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సారా జేన్ – ఆర్య మూవీ హీరోయిన్ అనురాధా మెహతా – వరుడు మూవీ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా – దిల్ సినిమాతో సక్సెస్ నందుకున్న నేహా కూడా మళ్లీ కనిపించలేదు. నాగచైతన్య మూవీ ‘సాహసమే శ్వాసగా సాగిపో” హీరోయిన్ మంజిమా మోహన్ లు ఒక్క సినిమాతోనే కనుమరుగైపోయిన వాళ్లలో ఉన్నారు. ఇలా టాలీవుడ్ లోకి ఎన్నో ఆశలతో తెరంగేట్రం చేసిన హీరోయిన్లు చాలా మంది ఆ ఒక్క సినిమాతోనే కనుమరుగైపోయారు. మళ్లీ సినిమాల్లో చేసింది లేదు…తెరపై కనిపించింది లేదు. టాలీవుడ్ కలలు కల్లలైన హీరోయిన్ల కథ ఇదీ..
మరి ఇంకొందరయితే ఒకరి రెండు సినిమాల్లో తళుక్కుమని ఆ తర్వాత కనిపించరు. దీనంతటికి కారణం ఏమయి ఉంటుంది. అది వాళ్లకు టాలెంట్ లేదనుకోవాలా, లేక లక్క కలిసిరాలేదా, లేక టాలీవుడ్లో హీరోయిన్లు ఎక్కువయిపోయారా ఇలా ఎన్నోన్నో సందేహాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ హీరోకయినా హీరోయిన్‌కయినా కాస్త లక్ అనేది కూడా ముఖ్యమే. కొన్ని సార్లు ఎంత కష్టపడినా లక్ కలిసిరాకపోతే ఏమీ చెయ్యలేము. ఒక్కోసారి లక్ బావుంటే నైట్‌కి నైట్ ఫ్యామస్ అయిపోయిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఉదాహరణ ప్రియావారియర్, పాయల్‌రాజ్‌పుత్ ఇలా కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు ఒక్క కన్నుగీటుతోనే మంచి ఫ్యామస్ అయిపోయింది ప్రియావారియర్, ఇక పాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి సినిమాతో బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించింది.