Thippara Meesam Movie Pre Release Event
“తిప్పరా మీసం” పెద్ద హిట్ అయి నిర్మాత దర్శకులకు మంచి పేరుతో పాటు మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.. ఫ్రీ-రిలీజ్ ఈవెంట్లో వి.వి.వినాయక్
శ్రీవిష్ణు హీరోగా నిక్కి తంబోలి హీరోయిన్ గా అసుర ఫేమ్ విజయ్ కృష్ణ ఎల్. దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించిన చిత్రం “తిప్పరా మీసం”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబర్ 8న వరల్డ్ వైడ్ గా గ్లోబల్ సినిమాస్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.. ఈ చిత్రం ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ నవంబర్ 3న హైదరాబాద్ దసపల్ల హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నారా రోహిత్, ప్రముఖ నిర్మాత యం యల్ కుమార్ చౌదరి, హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నిక్కి తంబోలి, దర్శకుడు కృష్ణవిజయ్.ఎల్, నటుడు, సమర్పకుడు అచ్యుత రామారావు, నటులు బెనర్జీ, నటి రోహిణి, రవిప్రకాష్, రవివర్మ , కమేడియన్ నవీన్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి తదితరులు పాల్గొన్నారు.. తొలి టిక్కెట్ ని వినాయక్, రోహిత్ కొనుగోలు చేశారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ఆ కథల్లో ఇన్వాల్వ్ అవుతూ కొత్త రకం సినిమాలు చేస్తున్నాడు. బ్రోచేవారేవారురా సినిమాని మూడుసార్లు చూశాను. నాకు బాగా నచ్చింది. ఆడియెన్స్ లో సినిమా ఇండస్ట్రీలో మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు విష్ణు. ఇక ముందుకుడా ఇలాగే మంచి సినిమాలు చెయ్యాలి. ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతలకు మంచి లాభాలతో పాటు పేరు తీసుకురావాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు..
నారా రోహత్ మాట్లాడుతూ.. ఆల్మోస్ట్ ఈ టీమ్ అందరితో వర్క్ చేశాను. సినిమా చూశాను నాకు బాగా నచ్చింది. వండ్రఫుల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది.. శ్రీవిష్ణు ఇంకా పెద్ద సినిమాలు చెయ్యాలి. విజయ్ ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ అవుతాడు.. విజయతో నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా చేయబోతున్నాను.. అన్నారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ… తిప్పారామీసం చాలా పవర్ ఫుల్ మాస్ టైటిల్.. ఇలాంటి మాస్ టైటిల్ తో చేసిన ఈ ఫంక్షన్ కి వినాయక్ గారిలాంటి మాస్ డైరెక్టర్ గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇటివరకు చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉంటుంది. విజయ్ నేను చాలా రోజులుగా ట్రావెల్ అవుతున్నాం. చాలా దెగ్గరగా నను చూశాడు. అలాంటి వ్యక్తి నెగిటివ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. కథ చాలా సూపర్ గా ఉంది. ప్రపంచంలో ఏదైనా మారొచ్చేమో గాని అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. అలాంటి మదర్ సెంటిమెంట్ తో చేసిన ఈ చిత్రం అందరికీ మంచి ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది. మదర్ గొప్పదనం గురించి చెప్పే ఈ చిత్రంలో నటించినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. రోహిణీ గారు మదర్స్ ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రాన్ని చూసి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.. రిజ్వాన్, విజయ్, రామారావు, ఖుషీ బాగా సపోర్ట్ చేశారు.. అన్నారు.
దర్శకుడు కృష్ణవిజయ్ యల్. మాట్లాడుతూ.. ఫ్రెండ్స్ అందరం కలిసి చేసిన సినిమా ఇది. ఒక మంచి ప్రయత్నం చేశాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. శ్రీవిష్ణు క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో రోహిణి గారి క్యారెక్టర్ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మదర్ పాత్రకు ప్రాణం పోసి చేశారమే. ఈ క్రెడిట్ అంతా మా టీమ్ కె చెందుతుంది.. ఈ నెల 8న సినిమా విడుదలవుతుంది.. అన్నారు.
ప్రముఖ నిర్మాత యం. యల్.కుమార్ చౌదరి మాట్లాడుతూ… తిప్పారామీసం టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. శ్రీవిష్ణు సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తున్నారు. అతని సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లోనే కాదు డిస్ట్రిబ్యూటర్స్ అందరిలో మంచి క్రేజ్ ఉంటుంది. అంతలా క్రేజ్ ని పాపులారిటీని సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. త్వరలో మా అమ్మాయి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి శ్రీవిష్ణుతో సినిమా చేయబోతున్నాం.. రిజ్వాన్ బ్యానర్లో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము.. అన్నారు.
నటుడు బెనర్జీ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో నటించాను. చాలా మంచిపాత్ర. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చే చిత్రం ఇది.. అన్నారు.
నటి రోహిణి మాట్లాడుతూ.. దర్శకుడు విజయ్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. చాలా కొత్తగా నా క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం నేను కూడా ఈగరగా వెయిట్ చేస్తున్నాను.. అన్నారు.
కో-ప్రొడ్యూసర్ అచ్యుత రామారావు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరికీ మంచి పేరు వస్తుంది. సినిమా చూశాక మా ఎక్స్ పెక్టేషన్స్ మించి ఉంది. ఈ సినిమా తర్వాత కృష్ణ విజయ్ పెద్ద డైరెక్టర్ అవుతాడు.. అన్నారు.
నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. విజయ్ ది బెస్ట్ మూవీ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. శ్రీవిష్ణు చాలా కష్టపడి ఈ సినిమా చేశాడు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్స్ అంతా నాకు బాగా హెల్ప్ చేశారు. ఈ సినిమా మేము చేసినందుకు గర్వంగా ఉంది.. అన్నారు.