Trivikram Srinivas Interview Photos
నాలాగే రాస్తున్నారు అని ఎప్పుడు అనిపించలేదు చాలా సార్లు నాకంటే బాగా రాస్తున్నారు అనిపించింది – త్రివిక్రమ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది,
ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
ఈ కథతో రాజు అయితే సరిపోదు,రాజసం ఉండాలి అని చెప్తున్నారా.?
లేదు.!మీరు చెప్పింది బాగుంది కానీ
ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయి ని ఇవ్వలేము అది6 వాళ్లకు6 వాళ్ళు సంపాదించుకోవాలి అనేది ఈ సినిమా బేసిక్ థాట్.
డబ్బు ప్రభావం మనుషులు మీద ఎంతవరకు ఉంటుంది అని ఈ సినిమాలో ఏమైనా చెప్పారా.?
లేదు ఆ పాయింట్ టచ్ చేయలేదు అది ఉంటుంది అని నేను అనుకోవట్లేదు.
కర్ణుడు ఎపిసోడ్ తీసుకుంటే తను ఎక్కడో ఉన్న కూడా తనలో ఆ క్షత్రియ లక్షణాలు ఉంటాయి,
ఈ కథకు అది ఎక్కడైనా ఇన్స్పైర్ చేసిందా.?
లేదండి.! ఇప్పుడేంటి అంటే ప్రపంచంలో ఈ కథ చెప్పిన రామాయణ,మహాభారతాలను టచ్ చేయకుండా చెప్పలేము,ఈ విషయం అందరూ ఒప్పుకున్నదే.బహుశా ఏదొక ఛాయా దానిలోనిది ఉండే ఉండొచ్చు.
త్రివిక్రమ్ గారి సినిమా అంటే పంచ్ డైలాగ్స్ కామెడీ ఉంటుంది అవి ఎందుకు వదిలేశారు.?
అవి వదిలేసిన కూడా నేను సినిమా చేసి మెప్పించగలిగాను కదా,
కొత్త బలాలు వెతుక్కోవడంలో తప్పేమీ లేదు,అర్జునుడు విల్లు బాగా వేస్తాడు కరెక్ట్ యే కానీ అప్పుడప్పుడు కత్తి కూడా తీస్తే తప్పేమీ లేదు కదా,
శత్రువు చాలా దగ్గరకు వచ్చేసాడు,ఈ లోపు బాణం తీసి మొక్కి వేసే బదులు కత్తి తీస్తే నెగ్గుతాం కదా,
నెగ్గితే ఆనందించాల్సిన విషయమే కదా.
టైటిల్ ఏమైనా పోతన గారి పద్యం ఇన్స్పిరేషన్ ఆ.?
ఏమైనా ఏంటి అండి అదే డైరెక్ట్ గా తీసుకొచ్చి పెట్టాను.
ఫ్యామిలీస్ ని చాలా కొద్దిమంది మాత్రమే థియేటర్ కి తీసుకొస్తారు,
మీకు ఆ ఘనత ఉంది,ఇది ఏమైనా ఒత్తిడిగా ఫీల్ అయ్యారా.?
లేదండి,మనలను మనం అంత సీరియస్ గా తీసుకోవడం అనవసరమని నా ఫీలింగ్
వాళ్ళు అభిమానించేది నన్ను కాదు నా వర్క్ ని.
ఒక సినిమా నచ్చలేదు అంటే నా వర్క్ మొత్తం నచ్చనట్లు కాదు కాదు ఆ టైం కి అది నచ్చలేదు అంతే.
ప్రేక్షకదేవుళ్ళు అని ఎందుకంటాం అంటే
థియేటర్ లో లైట్స్ ఆపిన తరువాత జాతి,కులం,మతం,ప్రాంతం చూడకుండా సినిమా చూసి బయటకు వచ్చి బాగుంది బాగాలేదు అని చెప్తాడు కాబట్టి.
ప్రేక్షక దేవుళ్ళు అనే కాన్సెప్ట్ మీరు నమ్ముతారా.?
మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే దేవుడు అనేది ఒక పొజిషన్ కాదు కండిషన్ అదొక స్థితి స్థానం మాత్రం కాదు,
ఆడు థియేటర్ నుంచి బయటకు వచ్చి రోడ్ మీద వెళ్తూ ఒక అమ్మాయి మీద యాసిడ్ పోస్తే వాడు దేవుడు ఎలా అవుతాడు సర్.?
అల వైకుంఠపురంలో చూసిన తరువాత నాన్న మీద రెస్పెక్ట్ పెరుగుతుందా.?
ఖచ్చితంగా నాకు అమ్మ మీద,నాన్న మీద రెస్పెక్ట్ లో ఏ విధమైన లోపం లేదు,
ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారో తెలుసు ఒక పాటలో రెండు లైన్స్ పట్టుకుని అడుగుతున్నారు.
కానీ సినిమా చూసాక మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు.
అప్పటి అల్లు అర్జున్ కి ఇప్పటికి తేడా ఏంటి.?
జులాయి కి పెళ్లి అవ్వలేదు
సన్నాఫ్ సత్యమూర్తి పెళ్లి అయి ఒక పిల్లాడు పుట్టాడు,
ఈ సినిమాకి ఇద్దరు పిల్లలు పుట్టారు.
హ్యాట్రిక్ గ్యారంటీ ఆ.?
మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మీరు కూడా గ్యారంటీ అంటారని అనుకుంటున్నాం.
మీరు కామెడీ రాసిన కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడరు,
అలా ఎలా రాస్తారు మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉంటుందా.?
నిజంగా మీరు నమ్మి తీరాలి,
నేనేమి ఎక్కువ చెప్పట్లేదు నన్ను నేను ఒక స్పాంటినిస్ రైటర్ గా చూసుకుంటా..
ఒక సముద్ర తీరం,మంచి ప్రదేశం,విదేశాల్లో ఒక కాటేజీ అందులో కూర్చుని కాఫీ తాగుతూ రాయమంటే నేను ఒత్తిడితో తల పగిలి చచ్చిపోతాను,
నా కోసం ఇంత ఖర్చుపెడుతున్నారు అని.
నేను మాములుగా నా పిల్లలు బయట ఆడుకుంటుంటే, నా భార్య కిచెన్ లో వంట చేస్తూ ఏవేవో సౌండ్స్ వస్తుంటే రాసుకుంటా….
నేను తేలికగా పని చేసుకోవడానికి ఇష్టపడతా.
మీ సినిమాల్లో చాలా సందర్భాలలో ఇంట్లోనే ఎక్కువ సన్నివేశాలు చూపిస్తున్నారు.?
ఇల్లు అనేది మన సంస్కృతి లో ఒక భాగం మనం ఉండే ఒక ప్రదేశం అది చిన్నదే కావొచ్చు అది పెద్ద గ్రేట్ హౌస్ కాకపోవచ్చు కానీ దానితో ఉండే ఆనందం వేరు.
నువ్వే కావాలి,చిరునవ్వుతో లాంటి చాలా సినిమాలు మీ డైలాగ్స్ వలన ఆడాయి,
ఇప్పుడొస్తున్నా రైటర్స్ మీలా రాయాలి అనుకోవడం మీకు ఎలా ఉంది.?
వీడు నాలాగే రాస్తున్నాడు అని ఎప్పుడైనా అనిపించిందా.?
నేను నిజాయితీగా చెప్తున్నా నేను ఏదైనా సినిమా చూసేటప్పుడు ఏ వెయిట్ లేకుండా చూస్తాను బాగా రాశారే,బాగా తీసారే అనిపిస్తుంది.
నాలాగే రాస్తున్నారు అని ఎప్పుడు అనిపించలేదు నాకంటే బాగా రాస్తున్నారు అనిపించింది.
డైలాగ్స్ వలనే సినిమా ఆడుతుంది అంటే నేను ఎందుకు ఏకీభవంచను అంటే కథ,పాత్రలు,సన్నివేశం,తరువాత మాట వస్తుంది దానినే నేను కొంచెం బలంగా సూటిగా చెప్పాను కాబట్టి పేరు వచ్చింది అని నేను నమ్ముతాను.
సునీల్ గారు అంటే గుర్తొచ్చేది బంతి,పద్దు, బంకు సీను లాంటి కేరెక్టర్స్ గుర్తొస్తాయి లాస్ట్ టైం నీలంబరి కేరెక్టర్ కి కామెడీ కి స్పెస్ లేదు ఈ సినిమా లో ఎలా ఉండబోతుంది.?
ఈ సినిమా దానికంటే కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ గానే ట్రై చేసాం.
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు.?
చాలామంది ఉన్నారు,ఒకరంటే చెప్పడం కష్టం నేను అన్ని పుస్తకాలు చదివేసాను అనుకుంటారు నేను చదవనివి బోలెడు ఉన్నాయి ఇప్పుడు పతంజలి సాహిత్యం చదువుతున్నాను.
పుస్తకాలు మీ సినిమాలకు ఉపయోగపడుతున్నాయి.?
ఎప్పుడూ అలా చదవను,ఒకవేళ నేను రాసుకుని ప్రోసెస్ లో ఎప్పుడో చదవినవి,విన్నవి,చూసినవి గుర్తొస్తాయి.
మీ పర్సనల్ లైఫ్ కి కథలు స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు చూసారు ఇప్పుడొక లైఫ్ ఉంది, ఒక రైటర్ గా ఆ రెండు స్టేజ్ లు మిమ్ముల్ని ఎలా ప్రభావితం చేసాయి.?
చాలామంది అడుగుతారు నన్ను,
ఇప్పుడు చాలా ఇంటర్వ్యూ లు చూస్తే పస్తులున్నం, చాలా ఆఫీస్ లు నుండి గెంటేశారు అని వింటూ ఉంటాం,
నువ్వు ఎందుకు ఇలాంటివి చెప్పవు నీకు ఎప్పుడు జరగలేదా అంటారు చాలామంది,
బోలెడన్ని జరిగాయి అలాంటివి నేనెందుకు చెప్పను అంటే,
శ్రీ శ్రీ రాసిన అనంతం గురించి నన్ను మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే,
నేను మందు మనేసాను అని శ్రీ శ్రీ లాంటి వ్యక్తి చెప్తే ఆ ఇన్స్పిరేషన్ తో చాలామంది మందు మానేశారు,
కానీ ఫలానా బ్రాండ్ మందు తాగుతాను అంటే అది నిజమే,ఇది నిజమే ఈ నిజం చెప్పాలి అనేది మన విజ్ఞతకి వదిలేస్తే మంచిది.
ప్రతి వాడి జీవితంలో చీకటి కోణాలు ఉంటాయి,కాకపోతే ఈ కోణం అవతలవాడు బెటర్మెంట్ కి ఉపయోగ పడుతుంది అనేది చెప్పాలి.
ఐనాస్టీన్ ఒక మాట చెప్తాడు,
రోజు ఒకే పనిని ఒకే విధంగా చేస్తూ వైవిధ్యమైన ఫలితాలు రావట్లేదు అని ఎందుకు ఆశిస్తావ్.
పని మార్చు లేదా పని చేసే పద్ధతి మార్చు.