Uttej Mayukha Film Acting School Press meet
ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ నిర్వహిస్తున్న “మయూఖా టాకీస్ ”
యాక్టింగ్ స్కూల్ సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు( అక్టోబర్ 15) ఫిలిం ఛాంబర్లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాలులో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, యువ నిర్మాత రాహుల్ యాదవ్, దర్శకనిర్మాత లక్ష్మీకాంత్, మయూఖా టాకీస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఉత్తేజ్, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నట శిక్షణ పూర్తి చేసుకున్న రెండు బ్యాచ్ ల యాక్టింగ్ స్టూడెంట్స్ కు దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా తొలుత తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ” నటుడుగా, రైటర్ గా, కవిగా,వక్తగా 30 సంవత్సరాల అద్భుతమైన ప్రస్థానంలో తనను తాను గొప్పగా తీర్చిదిద్దుకున్న ఉత్తేజ్ ఇప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించి తెలుగు తెరకు కొత్తతరం నటీనటులను అందించే ప్రయత్నం చేయటం అభినందనీయం. నటుడిగా తనకున్న అపారమైన అనుభవమే ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది… ఇప్పటికి రెండు బ్యాచ్ లు గా నట శిక్షణ పొంది వీడ్కోలు తీసుకుంటున్న స్టూడెంట్స్ కు మంచి అవకాశాలు వస్తున్నట్లుగా తెలిసింది. వారికి నా అభినందనలు.. కొత్త బ్యాచ్ కి ఆల్ ద బెస్ట్” అన్నారు.