Valmiki trailer launch
‘నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు..’
పవర్ఫుల్ మాస్ డైలాగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వరుణ్‌తేజ్ ‘వాల్మీకి’ ట్రైలర్
‘నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు..’,
‘మనం బతుకుతున్నమని పదిమందికి తెల్వకపోతే.. ఇగ బతుకుడెందుకురా..’
‘జిందగీ మాదర్చోద్ తమ్మీ… ఉత్త గీతలే మన చేతులుంటయ్, రాతలు మన చేతులుండయ్’
‘గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పీలహరి పాట కొట్టుడు, నేను బొక్కలిరగ్గొట్టుడు.. సేమ్ టు సేమ్.. అదే ప్యాసన్’
…ఇవీ వరుణ్‌తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్మీకి’ చిత్రంలోని పవర్ఫుల్ మాస్ డైలాగ్స్. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం విడుదలైన ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘వాల్మీకి’ చిత్రంలో వరుణ్‌తేజ్ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నారు. వరుణ్‌తేజ్ చెప్పే డైలాగ్స్‌కి థియేటర్లో విజిల్స్, క్లాప్స్ ఖాయమని డైలాగ్స్ వింటే అర్థమవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
చిత్ర నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ – ”ఇటీవల విడుదల చేసిన మా వాల్మీకి టీజర్కిమంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌కి అంతకు మించి రెస్పాన్స్ వస్తుంది అని నమ్ముతున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె.మేయర్ మాట్లాడుతూ – ”ఇలాంటి ఒక విభిన్న తరహా చిత్రానికి నాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ గట్స్ ని ముందుగా అభినందిస్తున్నాను. నేను ఇప్పటివరకు మెలోడీ, క్లాసిక్ మ్యూజిక్‌నే ఇచ్చాను. ఇలాంటి ఒక మాస్ సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన వరుణ్, ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంటకి థాంక్స్. ఇప్పటికే విడుదలైన అన్ని సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాల్మీకి చిత్రం నాకు ఒక కంప్లీట్ చేంజ్ ఓవర్ లాంటిది. అలాగే వరుణ్ ఈ చిత్రంలో తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే ఐనాంక బోస్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ – ”ఈ చిత్రం జరగడానికి కారణమైన నిర్మాతలు రామ్ఆచంట, గోపిఆచంట గారికి ముందుగా థాంక్స్. జిగర్తాండ సినిమా వరుణ్‌తో చేస్తున్నాం..అన్నప్పుడు వరుణ్ ఏ క్యారెక్టర్ చేస్తాడు అని కూడా అడగకుండా వెంటనే రైట్స్ తీసుకున్నారు. నేనంటే వాళ్లకు అంత నమ్మకం. నేను సినిమాను ఎలా చూశానో వరుణ్ కూడా అలానే చూశారు. ఈ చిత్రంలో తన వయసుకు మించిన క్యారెక్టర్ చేశారు. ఆయన గట్స్‌కి నిజంగా హ్యాట్సాఫ్. మిక్కీ నేను సుబ్రహ్మణ్యంఫర్‌సేల్ సినిమాలో కలిసి పనిచేశాం. ఆ తరువాత మహానటి నాకు బాగా నచ్చింది. అతనితో కలిసి ట్రావెల్ అవుతుంటే తనుఎంత మంచి మ్యూజిక్ ఇవ్వగలడు అనేది తెలుస్తుంది. తనకి ఎంత గొప్ప కంటెంట్ ఉన్న మూవీ ఇస్తే అంత గొప్పగా మ్యూజిక్ చేయగలరు. ఈ సినిమా ప్రీ టీజర్ తరువాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దాని టీజర్ బ్యాలన్స్ చేసింది. టీజర్‌తో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి దాన్ని తప్పకుండా ట్రైలర్ బ్యాలన్స్ చేస్తుంది. జిగర్తాండలో వరుణ్ చేసిన క్యారెక్టర్ తమిళ నటుడు బాబీసిన్హా చేశారు. ఆయనకు అది నేషనల్ అవార్డు తెచ్చింది. ఆ క్యారెక్టర్ వరుణ్‌కి కూడా మంచి పేరు తెస్తుంది. తమిళ మాతృకలో చిన్న చిన్న చేంజెస్ చేయడం జరిగింది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. ప్రతి బోయ సంగం వాళ్లు, ప్రతి వాల్మీకి అభిమాని గర్వపడేలా సినిమా ఉంటుంది” అన్నారు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ”ఈ క్యారెక్టర్ చేస్తున్నాను అని తెలియగానే నా చుట్టూ కొంత నెగటివిటి ఏర్పడినా ఈ క్యారెక్టర్ చేయగలను అన్న కాన్ఫిడెంట్‌ని ఇచ్చింది మా దర్శకుడు హరీష్ గారు. చాలా మంచి కథలు ఉన్న కొన్ని మాత్రమే రీమేక్ చేయాలని అనిపిస్తాయి. అలాంటి కథే జిగర్తాండ. సినిమా ఇండస్ట్రీ గొప్పతన్నాని కూడా చెప్పే చిత్రం ఇది. నా లుక్‌కి, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌కి కూడా ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి క్యారెక్టర్స్ ఎంతో అవసరం. మొదట్లో హరీష్ ఎనర్జీని బ్యాలన్స్ చేయడానికి కొంత కష్టపడాల్సి వచ్చింది. తరువాత అలవాటు అయింది. సెప్టెంబర్ 20 మీ ముందుకు వస్తున్నాం. వాల్మీకి తప్పకుండా మీ అందరికి నచ్చే చిత్రం అవుతుంది” అన్నారు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అధర్వ, పూజ హెగ్డే, మృణాళిని రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రఫీ: ఐనాంక బోస్, ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: అవినాష్ కొల్ల, స్క్రీన్ ప్లే: మధు శ్రీనివాస్, మిథున్ చైతన్య, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్