Varun in Chiru’s Biopic

చిరు బయోపిక్‌లో వరుణ్
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. అథర్వా మురళి, మృణాళిని రవి, బ్రహ్మాజి, బ్రహ్మానందం, శత్రు తదితరులు నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈనెల 20న ‘వాల్మీకి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా వరుణ్ మీడియాతో ముచ్చటించారు.
వరుణ్ చిరంజీవి బయోపిక్‌లో నటిస్తానని ఎంతో ఆశక్తి కరమైన విషయం చెప్పారు. ఎవరన్నా తన దగ్గరకు చిరంజీవిగారి బయోపిక్ చేస్తానని ఎవరన్నా వస్తే దానికి మీరు అంగీకరిస్తారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా. అందుకు నేను సిద్ధమేనని కాని దానికంటే ముందు అన్నయ్య చరణ్ చేస్తే బావుంటుంది. ఒకవేళ ఆయన చెయ్యని పక్షంలో ఆ సినిమా చేయడానికి మొదటి వరుసలా నేనుంటానని చెప్పారు. కావాలంటే సిజిలో కాస్త హైట్ తగ్గించుకుంటాను. ఆయన బయోపిక్ చెయ్యడం అంటే అంతకన్నా అదృష్టమా అని అన్నారు. అలాగే ఆయన బయోపిక్హరీష్ శంకర్ తియ్యాలనుకుంటున్నారని కూడా అన్నారు. చిరంజీవిని తనకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించరని అందుకే ఆయన చెయ్యాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. అయితే అప్పుడు ఆయన మాత్రం తన పేరు చెప్పలేదని అన్నారు. ”పాటలు, డ్యాన్స్ నాకు కంఫర్ట్ జోన్ కాదు. హరీష్‌గారు ఈ సినిమా కథ చెప్పి ఒక రీమిక్స్ సాంగ్ ఉంది అన్నారు.