Varun’s brother made him tension free
వరుణ్ టెన్షన్ తగ్గించిన అన్నయ్య
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘గద్దలకొండగణేష్’. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మొదటి షో నుండే పాజిటివ్ టాక్‌తో సూపర్‌హిట్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా జెఆర్‌సీలో ఈ చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…
డైరెక్టర్ వరుణ్‌తేజ్ మాట్లాడుతూ… మనం సినిమాల్లో చాలా మందితో నటిస్తాం కాని అందరూ ఫ్రండ్స్ అవ్వరు. ఈ చిత్రంలో మాత్రం నాకు అధర్వ మంచి ఫ్రండ్ అయ్యాడు. ఏ మనిషిలోనూ స్పీడు, క్వాలిటీ రెండూ కలగలపి ఉండేది చాలా తక్కువ అలా రెండూ కలిసున్న మనిషే బోస్ మా సినిమాటోగ్రాఫర్. బ్రహ్మానందంగారితో ఎక్కువ సినిమాలు కలిసి చెయ్యలేకపోవడం నా దురదృష్టంగా భావిస్తున్నాను. ఇకముందు కూడా నేను ఆయనతో కలిసి నటించాలనుకుంటున్నాను అని అన్నారు. మా సినిమా ఉన్న చిన్న క్యామియో చెయ్యడానికి ఒప్పుకున్న నితిన్‌కి చాలా పెద్ద థ్యాంక్స్ అన్నారు. నా కుర్తాస్ని డిజైన్ చేసిన మా డిజైనర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. పూజా తను నా ఫస్ట్ హీరోయిన్. నాతో కలిసి మళ్ళీ ఇందులో నటించినందుకు థ్యాంక్స్. మిక్కీ జే మేయర్ సాంగ్స్ చాలా బావున్నాయి. ఇక హీరీష్గారి గురించి చెప్పాలంటే బాబాయ్‌తో గబ్బర్‌సింగ్ చేశాడు. నాతో ఈయన ఏమి చేస్తాడులే అనుకున్నా. కాని ఆయన చాలా మంచి సపోర్ట్ ఇచ్చి మంచి కథతో నా దగ్గరకి వచ్చారు. మా ప్రొడ్యూసర్స్ ఇద్దరూ బంగారం. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. సినిమా డబ్బులు ఇస్తుంది. పేరుని ఇస్తుంది. కాని ప్రేమిని కూడా ఇస్తుంది. ఈ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. మాకు ఇంత మంచి ప్లాట్‌ఫామ్ కలిగించినందుకు చిరంజీవి డాడీకి చాలా చాలా థ్యాంక్స్ అన్నారు. ఈ సినిమా టైటిల్ మార్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. సడెన్‌గా నైట్‌కి నైట్ అప్పటికప్పుడు టైటిల్‌ని మార్చారు. నాకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా అన్నయ్య చరణ్‌కి చెపుతాను అదేవిధంగా అన్నయ్యకి కాల్చేసి చెప్పగానే ముందునువ్వు కంగారు పడకు ఇక్కడకి రా అన్నాడు. అనగానే అన్నయ్య దగ్గరకి వెళ్లాను. అన్నయ్య, ఎన్టీఆర్‌గారు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. వారిద్దరు చెప్పిన మాటలతో నాకు చాలా వరకు స్ట్రెస్ తగ్గింది. వాళ్ళు నాకంటే సీనియర్లు వాళ్లు నాకు మంచి మాటలు చెప్పి నా టెన్షన్‌ని తగ్గించారు అన్నారు. నా స్ట్రెస్‌ని తగ్గించినందుకు వారిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.