Venkatesh Daggubati in Asuran Telugu Remake
‘Asuran’ is an action drama written and directed by Ventrimaaran. The film had hit the screens in Tamil Nadu for the Dussehra festival and scored a super hit.
Hero Venkatesh who is taking up only content driven roles these days, will be featuring in ‘Asuran’ Telugu remake.
The Daggubati hero is currently doing ‘Venky Mama’ and he has now given green signal for ‘Asuran’ remake.
This Telugu version will be jointly produced by Kalaipuli S. Thanu and Suresh Babu under V Creations and Suresh Productions banners.
The makers will announce the cast and crew details very soon.
ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన అసురన్ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది అసురన్ చిత్రం. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్.. అసురన్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ దగ్గుబాటి హీరో వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అసురన్ రీమేక్‌లో నటించనున్నారు. తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.