Venky Mama Press Meet Photos
సురేష్ బాబు కి ఏది అంత ఈజీ గా నచ్చదు- రవీంద్ర బాబీ
విక్టరీ వెంకటేష్,అక్కినేని నాగ చైతన్య మమా అల్లులు గా నటిస్తున్న వెంకీమామ డిసెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా మూవీ టీం మీడియా తో మాట్లాడారు.
సురేష్ బాబు మాట్లాడుతూ….
అందరికీ నమస్కారం,వెంకీ మామా సినిమా రిలేషన్ షిప్స్ సంబంధించి ఉంటుంది.
ఈ సినిమా రాజమండ్రి లో షూట్ చేసాం,కాశ్మీర్ లో వర్క్ చేసాము,
అందరూ మంచి సపోర్ట్ చేశారు,బ్రహ్మా పుత్రుడు టైం లో కశ్మీర్ వెళ్ళాను.
ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసాను వెరీ ఎమోషనల్ ఫిల్మ్,ఈ సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్,
ఈ సినిమా చివర్లో షూట్ కి ఒక 2 డేస్ ముందు బాబీ వచ్చి ఈ రోల్ కి ప్రకాష్ రాజ్ కావాలి అన్నప్పుడు కొంచెం ఆలోచించాం,ప్రకాశ్ రాజ్ గారు మంచి ఇంపార్టెన్స్ ఉన్న కేరెక్టర్ చేశారు,
ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి.సినిమా 13 న రిలీజ్ కానుంది తప్పకుండా చూడండి.
రాశీఖన్నా మాట్లాడుతూ…..
ఈ రోజు చాలా సంతోషంగా ఉంది,నేను కూడా మీలాగే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను,నేను వెంకటేష్ సర్ నేను చాలా పెద్ద ఫ్యాన్,
ఆయనతో కూడా ఈ సినిమాలో చేయడం చాలా హ్యాపీగా ఉంది,
నాగ చైతన్య తో 2 సినిమాలు చేసాను,మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది,డైరెక్టర్ బాబీ ఎప్పుడు నవ్వుతూ కూల్ గా ఉంటారు,వెరీ పాజిటివ్ పర్సన్,థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు,ఈ సినిమా 13 న రిలీజ్ కానుంది,మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ….
నేను జై లవకుశ చేస్తున్నప్పుడు కోన గారు ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి మామా అల్లుళ్లు రిలేషన్ షిప్ ఒక కథ ఉంది అని చెప్పినప్పుడు ఈ కాంబినేషన్ నేను ఇష్టపడి సురేష్ బాబు గారి దగ్గరకు వెళ్లి దీనిమీద వర్క్ చేస్తాను అని అడిగాను,
సురేష్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది జాగ్రత్తలు చెప్పారు,ఆయన పుస్తకం లాంటోడు ఏది అంత ఈజీ గా ఏదీ నచ్చదు అని చెప్పారు,కానీ నేను వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన సూపర్ సూపర్ అని చెప్పారు,తర్వాత బుక్ తీసుకుని చాలా క్వశ్చన్స్ చేశారు కానీ ప్రతిదాని వెనుక ఒక లాజిక్ ఉంది,ఆయన దగ్గర చాలా నేర్చుకున్న,
ఈ సినిమాలో హీరోయిన్స్ కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది,వెంకీ సర్ చైతన్య మామా అల్లుళ్లు గా బాగా చేశారు మంచి సపోర్ట్ చేశారు, ఈ సినిమాని నాకు పరిచయం లేని ఒక 30 మందికి చూపించారు,అందరికీ బాగా నచ్చింది, ఈ సినిమా చూసి బాగా ఎమోషనల్ ఫీల్ అయి థమన్ హగ్ చేసుకున్నాడు నన్ను,ఈ సినిమా డిసెంబర్ 13 న రిలీజ్ కానుంది తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను.
నాగ చైతన్య మాట్లాడుతూ….
నా కెరియర్ లో ఎన్ని సినిమాలు వచ్చిన రెండు మాత్రం నాకు బాగా గుర్తుండిపోతాయి, మనం & వెంకీ మామా.
సురేష్ ప్రొడక్షన్స్ లో ఎప్పటినుండో సినిమా చెయ్యాలి అనుకున్నాను కానీ అది ఇప్పుడు జరిగింది. వెంకీ మామా తో ప్రేమమ్ లో రెండు సీన్స్ చేసినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చాలా ఆలోచించాం ఫైనల్ గా
ఈ సినిమా 13 న చాలా థియేటర్లలో రిలీజ్ కానుంది తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను.
వెంకటేష్ మాట్లాడుతూ….
ఇప్పుడొచ్చిన కుర్రాళ్లు అందరూ బాగా మాట్లాడటం నేర్చుకుంటున్నారు కానీ నాకు మాత్రం రావట్లేదు (నవ్వుతూ…..)
ఎన్నో సినిమాలు చేసాను, కానీ ఇది మాత్రం ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ,మీరు చైతన్య ని చాలా సినిమాలో చూసి ఉంటారు,ఈ సినిమాలో మాత్రం చాలా బాగా చేసాడు,నాతో పాటు నటించిన కో-ఆర్టిస్ట్ లు అందరికి థాంక్స్,
సినిమా చాలా బాగా వచ్చింది. బాబీ చాలా బాగా తీసాడు.చైతన్య కెరియర్ లో ఇది ఒక బెస్ట్ రోల్.చాలా హ్యాపీ గా ఉంది,సినిమాని అందరూ తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను.