Venky Mama Review
మిలటరీ నాయుడు-విక్టరీ అల్లుడు అదరగొట్టారు- వెంకీ మామా
నటీనటులు-విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య, పాయల్ రాజపుత్,రాశిఖన్నా
దర్శకత్వం-కె. ఎస్.బాబీ
నిర్మాత-డి.సురేష్ బాబు,టి.జి.విశ్వప్రసాద్,వివేక్ కూచిబోట్ల
సంగీతం-ఎస్.థమన్
సినిమాటోగ్రఫీ-ప్రసాద్ మూరెళ్ళ
రిలీజ్-సురేష్ ప్రొడక్షన్స్
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మామా అల్లుళ్లు గా కలిసి నటించిన
“వెంకీమామా” విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
మిలటరీ వెంకటరత్నం నాయుడు (విక్టరీ వెంకటేష్) ఊర్లో మంచి పేరున్న వ్యక్తి.జాతకాలు ప్రకారం తన అక్క పెళ్లికి ఒప్పుకోని కారణంగా తండ్రిని ఎదిరించి పెళ్లి చేయడం,ప్రమాదవశాత్తు జాతకం ప్రకారం ఒక యాక్సిడెంట్ లో అక్క,బావ ప్రాణాలు పోవడం దానితో అల్లుడు కార్తిక్ (నాగ చైతన్య) బాధ్యతను తీసుకుని పెంచడం,అది మిలటరీ నాయుడు తండ్రి కి నచ్చకపోవడం.
కార్తీక్ మిలటరీ నాయుడు తల్లిదండ్రులకు నచ్చకపోవడానికి కారణాలు ఏంటి,మామా-అల్లుళ్లు లా ప్రేమకథలు ఏంటి,వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏంటి,చివరికి అల్లుడు ఇంట్లో నచ్చాడా లేదా,ఎందుకు కార్తిక్ ని దూరం పెట్టాలి అనుకున్నారు అనే విషయాలు సినిమాలో చూడాలి.
విశ్లేషణ:
సినిమాని చాలా అందంగా తీర్చిదిద్దాడు దర్శకుడు బాబీ,మామ అల్లుళ్లు మధ్య అనుబంధం, గోదావరి అందం,అన్నింటిని కళ్ళకు కట్టినట్లు చూపించాడు,వెంకటేష్ లో మాస్ యాంగిల్ చూసి చాలా రోజులు అయినా ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చాడు,
అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో మన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి,
మిలటరీ నాయుడు-విక్టరీ అల్లుడు పెరఫార్మన్స్ అయితే అదిరిపోయింది.థమన్ తన మ్యూజిక్,బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లగలిగాడు,ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంటుంది.పాయల్ రాజపుత్, రాశీఖన్నా వాళ్ళ అందం,అభినయంతో సినిమాకి తమదైన న్యాయం చేశారు.
మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీ అంత చక్కగా చూసి హాయిగా నవ్వుకుని ఆనందంతో బయటకు వచ్చే సినిమా.!
This is the perfect gift for victory venkatesh.!
Happy Birthday Venkatesh.
Congrats to k.s.Ravindra boby
Rating:3