vidhi vilasam movie opening
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ‘విధి విలాసం` ప్రారంభం!!
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ బేనర్ పై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘విధి విలాసం’. దుర్గా నరేష్ గుత్తా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. హీరోహీరోయిన్లపై షూట్ చేసిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ కొట్టగా డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. జీవితా రాజశేఖర్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
దర్శకుడు దుర్గా నరేష్ గుత్తా మాట్లాడుతూ – “ఆదిత్ నాకు మంచి సన్నిహితుడు. ఆయనతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. శివాత్మిక పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ‘విధి విలాసం’ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రామాయణం ఎలాగైతే మూడు కోణాలలో ఉంటుందో మా సినిమాని కూడా అలాగే అర్ధం చేసుకుంటారు” అన్నారు
హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ – ” ఈ కథ విన్నప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఆదిత్ నాకు చాలా కాలంగా మంచి స్నేహితుడు. ఆయనతో కలిసి నటించడం హ్యాపీ. నరేష్ గారి మాటల్లో కూడా మంత్రాలు ఉంటాయి. తప్పకుండా అందరికి నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు.
నిర్మాత శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి మాట్లాడుతూ – “నరేష్ గారిని కలిసిన మొదటి సిట్టింగ్ లోనే కథ ఒక చేశాం. అలాగే హీరో ఆదిత్, హీరోయిన్ శివాత్మిక మా ఫస్ట్ ఛాయిస్. వారిద్దరూ ఈ కథకు యాప్ట్ అనిపిస్తారు. ఫిబ్రవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ – “ఈ ఏడాది రెండో సినిమా. దుర్గ నరేష్ దశరథ్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. వెరీ టాలెంటెడ్. అలాగే శివాత్మిక తో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. మా నిర్మాత శివ గారు ఫస్ట్ సిట్టింగ్ లోనే కథ ఒకే చేశారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకి అందివ్వాలనే ఉద్దేశ్యం తో ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది” అన్నారు.
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్, ఇంద్రజ, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్, పోసాని, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, అజయ్, సత్య, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : ఎస్.వి విశ్వేశ్వర్,
సంగీతం: శేఖర్ చంద్ర,
ఎడిటర్; సత్య గిడుతూరి,
ఆర్ట్ డైరెక్టర్: సుమిత్ పటేల్,
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మాచర్ల,
ప్రొడక్షన్ కంట్రోలర్; కృష్ణ వర్ధన్,
నిర్మాత : శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దుర్గ నరేష్ గుత్తా.