Vijay Deverakonda Wishes to Masooda Team
‘Masooda’ is spooky: Pan-India star Vijay Deverakonda
Rowdy extends best wishes to Team ‘Masooda’
The film releases big on November 18
“What a great trailer. Intriguing. Well made. Congratulations to the whole team, my complete support and love to you all. Special shout out to Rahul Yadav Nakka for backing new stories and talent! May all your dreams come true,” tweeted Pan-India star Vijay Deverakonda, reacting to the trailer of ‘Masooda’. As promised earlier, he is supporting the movie’s passionate team.
The actor has spent quality time interacting with Team ‘Masooda’. He used the occasion to know more about the film’s subject and the team’s journey. The ‘Arjun Reddy’ star expressed his interest to catch the movie at the earliest.
‘Masooda’ has been made by Swadharm Entertainment, which is known for ‘Malli Raava’ and ‘Agent Sai Srinivas Athreya’. For producer Rahul Yadav Nakka, this is his third film.
The horror-drama introduces director Sai Kiran to the film industry. The film is gearing up for a grand release on November 18 after completing all formalities. This is going to be a worldwide release.
The trailer, which warns that the actual horror is upcoming, has only raised the audience’s curiosity about the film and its trailer. Vijay said that he knows a lot of the cast and crew members associated with ‘Masooda’. “I have known Thiruveer for many years. Cinematographer Nagesh cranked the camera for my movie ‘Pelli Choopulu’. He also completed a schedule of ‘Arjun Reddy’. He is one of the contributors to the success of my filmography. I have a lot of liking for him. Naveen Polishetty was introduced by producer Rahul with ‘Agent Sai Srinivas Atreya’. With ‘Masooda’, he is introducing Sai Kiran as the director. I also follow Prashant R Vihari’s music. I have a feeling that ‘Masooda’ is going to make for an exciting watch. This one looks like a true-blue horror-drama made after a long time in Telugu cinema. I hope everyone loves the trailer. My love and best wishes to the team. I urge the audience to watch the movie only in theatres and make it a grand success,” Vijay said.
The film is going to be released in the Telugu States by Dil Raju’s Sri Venkateswara Creations.
Cast:
Sangeetha, Thiruveer, Kavya Kalyanram, Subhalekha Sudhakar, Akhila Ram, Bandhavi Sridhar, Satyam Rajesh, Satya Prakash, Surya Rao, Surabhi Prabhavathi, Krishna Teja and others.
Crew:
Banner: Swadharm Entertainment
Art Director: Kranthi Priyam
Stunts: Ram Kishan, Stunt Joshua
Music Director: Prashant R Vihari
Editor: Jesvin Prabhu
Cinematographer: Nagesh Banell
PRO: B Veera Babu
Producer: Rahul Yadav Nakka
Writer, Director: Sai Kiran.
* చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన హీరో విజయ్ దేవరకొండ
* నవంబర్ 18న రిలీజవుతోన్న ‘మసూద’ ఘన విజయం సాధించాలి
‘‘వాట్టే గ్రేట్ ట్రైలర్.. అద్భుతం, చూస్తుంటే ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది..’’ అంటూ పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్గా ‘మసూద’ ట్రైలర్ విడుదల సమయంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడీ సినిమా టీమ్‌కు తన సపోర్ట్ అందించారు. చిత్రటీమ్ని కలిసి వారితో కాసేపు సరదాగా ముచ్చటించి.. సినిమా విశేషాలను అడిగి తెలుసుకుని.. ‘మసూద’ సినిమాపై తనకున్న ప్రేమను తెలియజేశారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ‘అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అస్సల్ భయం ముందుంది’ అంటూ తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటుంది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘టీమ్‌లో చాలా మంది నాకు తెలుసు. చిత్ర హీరో తిరు.. నా ఫస్ట్ సినిమా అప్పటి నుంచి తెలుసు. నాతో పాటు అతను కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నగేష్ నా ‘పెళ్లిచూపులు’ సినిమా కెమెరామ్యాన్. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఓ షెడ్యూల్ అతను చేశాడు. నా ఉన్నతికి ఆయన కూడా ఓ ప్రధాన కారణం. అతనంటే నాకెంతో ఇష్టం. రాహుల్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాని మా నవీన్‌తో ప్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ కొత్త బంచ్‌తో ఈ సినిమా చేస్తున్నారు. సాయికిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అంటే నాకెంతో ఇష్టం. నవంబర్ 18న ‘మసూద’ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. భయపెడుతుంది కూడా. ఈ మూవీ ట్రైలర్ నాకెంతో నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందుకే నా ప్రేమ, అభినందనలు ఈ టీమ్‌కి ఇలా తెలియజేస్తున్నాను. అందరూ థియేటర్లలో ఈ సినిమాని చూడండి. ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.
చాలా కాలం తరువాత తెలుగులో పూర్తి హారర్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్విసి బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు.
సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్
కళ: క్రాంతి ప్రియం
కెమెరా: నగేష్ బానెల్
స్టంట్స్: రామ్ కిషన్ మరియు స్టంట్ జాషువా
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
పిఆర్ఓ: బి.వీరబాబు
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం: సాయికిరణ్