V.V Vinayak Seenaya Movie Opening
వి.వి.వినాయక్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రారంభమైన `సీనయ్య`
సెన్సేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `సీనయ్య`. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నరసింహ దర్శకత్వంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ చిత్రం ముహూర్తపు షాట్‌కి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు క్లాప్ నివ్వగా సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సి. కళ్యాణ్, దానయ్య డి.వి.వి,అనీల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – ” వినయ్‌తో `ఆది` సినిమా నుండి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తరువాత మా సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమాగా ఆయన దర్శకత్వంలోనే `దిల్` సినిమా చేశాం. ఆ సినిమా పేరే నా ఇంటి పేరుగా మార్చేంత పెద్ద సినిమా అయ్యింది. మా సంస్థ సక్సెస్‌ఫుల్‌గా, వినాయక్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా జర్నీ ట్రావెల్ అవుతున్న సందర్భంలో డైరెక్టర్ శంకర్ దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేసిన నరసింహ వేరే కథ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ సీనయ్య కథ అనుకున్నాడు. అయితే వేరే కథతో సినిమా చేద్దామని అనుకున్నాం కదా! అని కామ్‌గా అయిపోయాడు. అయితే ఈ సీనయ్య కథను మా హర్షిత్, ఇతర సభ్యులకు చెప్పాడు. వాళ్ల ద్వారా నా దగ్గరకు కథ చెప్పడానికి వచ్చాడు. కథ నచ్చింది. 1982-84 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ. ఓ సీనయ్య అనే వ్యక్తి కథ. కంప్లీట్ ఎమోషనల్ స్టోరి. కథ నచ్చడంతో ఎవర్ని హీరోగా అనుకుంటున్నావని అడిగితే.. చిన్నగా చేద్దామని అనుకుంటున్నాను సార్! అని చెప్పాడు. అలా తీస్తే ఈ సినిమా రీచ్ కాదు. దీనికి సమ్‌థింగ్ మ్యాజిక్ జరగాలని చెప్పి.. ఎవర్నైనా డైరెక్టర్ని హీరోగా చేద్దామని అనుకున్నాం. అసలు ప్రాక్టికల్‌గా వీలవుతుందా? అనే సందిగ్ధంలో ఆగిపోయాను. ఆ సమయంలో నా సినిమాలకు పనిచేసిన దర్శకుల గురించి ఆలోచిస్తున్నప్పుడు సడెన్‌గా వినాయక్ ఆలోచనకు వచ్చాడు. అసలు ఈ సినిమాను వినయ్‌తోనే చేయించాలి కదా! అనుకున్నాను. అదే విషయాన్ని నరసింహారావుకు కూడా చెప్పాను. తను చాలా ఎగ్జయిట్ అయ్యాడు. తర్వాత వినాయక్‌ని కలిసి ఇలా ఓ కథ ఉంది.. ముందు కథ విను అని చెప్పాను. వినయ్ కథ విని .. అన్నా!… నీ సెలక్షన్ రైట్ సెలక్షన్.. నేను యాక్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. తిరుమలలో ఉన్న నేను అక్కడే సినిమా గురించి అనౌన్స్ చేశాను. డైరెక్టర్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏంటి? అనే క్యూరియాసిటీ, క్వశ్చన్ మార్క్ ఉండేది. ఫస్ట్ లుక్ తర్వాత భలే ఉంది అని అందరూ అనుకున్నారు. షూటింగ్ మొదలు పెట్టేసి సమ్మర్లో విడుదల చేయాలని అనుకుంటున్నాం. హరి మా కథలో భాగమవుతున్నాడు. తను ఫ్యూచర్లో మా బ్యానర్ నుండి డైరెక్టర్‌గా కూడా ఇంట్రడ్యూస్ అవుతాడు. అలాంటి హరి బ్యాక్‌బోన్‌లా ఉంటాడు. మణిశర్మసంగీతం అందిస్తున్నాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఆర్టిస్టుల్లో ఎస్టాబ్లిష్డ్ తక్కువగా, కొత్తవాళ్లు ఎక్కువగా ఉంటారు. ఈ సినిమా కోసం వినయ్ డేడికేషన్‌తో నాలుగు గంటల పాటు జిమ్ చేస్తున్నాడు. స్లిమ్‌గా తయారయ్యాడు. సమ్మర్లో మంచి సినిమాను చూపిస్తాం. మంచి కథ ఉంటే రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాం“ అన్నారు.
హీరో వి.వి.వినాయక్ మాట్లాడుతూ – “డెస్టినీ నాకు కూడా వింతగా ఉంది. రాజుగారు ఓ రోజు వచ్చి నువ్వు నన్ను దిల్‌రాజుని చేశావ్.. నేను నిన్ను హీరోని చేద్దామనుకుంటున్నానని అన్నాడు. ఓ స్క్రిప్ట్ విన్నాను. నువ్వు అయితే బావుంటావు. చెయ్ బావుంటుందని అన్నాడు. నాకు కామెడీ, పాటలు, డ్యాన్సులు వద్దు.. హుందాగా ఉంటేనే చేస్తానని చెప్పాను. అలాంటి కథే అని దిల్‌రాజు అన్నారు. తర్వాత నరసింహ వచ్చి నాకు ఈ కథను చెప్పాడు. ఓ క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ఓ బయోపిక్‌లాంటి సినిమా. తను మనసులోని ఓ కథ. తను నెరేట్ చేసేటప్పుడే ఆ క్యారెక్టర్‌ను తనెంతగా ఇష్టపడ్డాడో తెలిసింది. కొంత సమయం అడిగి పాత్ర కోసం బరువు తగ్గాను. ఈ సినిమాకి స్క్రిప్ట్ పరంగా హరిగారు సపోర్ట్ అందిస్తున్నారు. రాజన్నకి థ్యాంక్స్. ఆయన కథనే నమ్ముతాడు. ఆయనకు ఈ సందర్భంగా థ్యాంక్స్. ఎస్వీసీ బ్యానర్ అంటే నా బ్యానర్ అనే ఫీలింగ్ ఉంటుంది. నా ఇంట్లో బ్యానర్ నుండి నేను హీరోగా చేస్తున్నాను. ఫస్ట్ లుక్ బావుందని అభినందించిన అందరికీ థ్యాంక్స్“ అన్నారు.
డైరెక్టర్ నరసింహ మాట్లాడుతూ – “ఇది వరకు వినాయక్‌గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నప్పటికీ మా `సీనయ్య`గా తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మంచి ఎమోషనల్ కథ. వినయ్‌గారు, రాజుగారు నన్ను నమ్మి నాకొక కొత్త బాధ్యతను ఇచ్చారు. గొప్ప టెక్నీషియన్స్‌ను ఇచ్చారు. అందరి సపోర్ట్‌తో నా బాధ్యతను కరెక్ట్‌గా నిర్వహిస్తానని చెప్పుకుంటున్నాను.
రైటర్ హరి మాట్లాడుతూ – “రాజుగారితో పదేళ్లుగా ట్రావెల్ చేస్తున్న నరసింహారావుగారు రాజుగారి దగ్గర, వినాయక్ దగ్గర కథ ఓకే చేయించుకున్న తర్వాత నేను ఇన్వాల్ అయ్యాను. వినాయక్‌గారు పెద్ద డైరెక్టర్ అయినా ఆర్టిస్ట్‌గా ప్రతి విషయాన్ని తెలుసుకుని ఫిజికల్‌గా, మెంటల్‌గా రెడీ అయ్యారు. మేం కూడా మా వంతు ప్రయత్నంగా సినిమాను చక్కగా తీర్చిదిద్దాం. అందరూ గర్వంగా చెప్పుకునేలా సినిమాను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాం“ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ మాట్లాడుతూ – “అవకాశం ఇచ్చిన రాజుగారికి, శిరీష్‌గారికి , నరసింహగారికి థ్యాంక్స్“ అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
సంగీతం – మణి శర్మ
ఛాయాగ్రహణం – సాయి శ్రీరామ్
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి
ఆర్ట్ – కిరణ్ కుమార్
రచన – డార్లింగ్ స్వామి, హరి, బాలశేఖరన్
నిర్మాతలు – రాజు, శిరీష్
కధ, చిత్రనువాదం, దర్శకత్వం – నరసింహ