What was thought and what was happened
అనుకున్నదొక్కటీ… అయ్యిందొక్కటీ…
మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న రిలీజ్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. మొన్న టీజర్ లాంచ్ సందర్భంగా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. కానీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్న ఈ చిత్రానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి భారీ హిందీ చిత్రం ‘వార్’ అడ్డంకిగా మారేలా కనిపిస్తోంది. ఆ మూవీ ట్రైలర్ చూశాక ‘సైరా’ టీం కంగారు పడుతూ ఉంటుందనడంలో సందేహం లేదు. ‘సైరా’ను ఎంతగా హిందీలో ప్రమోట్ చేయాలని చూస్తున్నా అక్కడ ఏమాత్రం క్రేజ్ వస్తుందో అన్న సందేహాలున్నాయి. ‘వార్’ లాంటి భారీ అంచనాలున్న చిత్రం రేసులో ఉండగా ‘సైరా’ను విడుదల చేస్తే కచ్చితంగా పంచ్ పడుతుంది. చిరు సినిమాను ఉత్తరాది వాళ్లు పట్టించుకోవడం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమాను వారం లేటుగా.. దీపావళి దసరా టైంలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
రామ్ చరణ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. 250 కోట్లతో నిర్మించిన సినిమాను పోటీ లేకుండా విడుదల చేస్తేనే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు భారీగా వస్తాయి. కానీ మరో భారీ సినిమా వస్తున్నపుడు పోటీకి వెళ్లి విడుదల చేస్తే కచ్చితంగా ఇద్దరూ నష్టపోతారు. ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నిర్మాత రామ్ చరణ్ తన సినిమాను వాయిదా వేస్తున్నాడని తెలుస్తుంది. నిజానికి అక్టోబర్ 2న ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మళయాల భాషల్లో విడుదల చేయాలనుకున్నాడు రామ్ చరణ్. కాని ఇప్పుడు అది ఎట్టిపరిస్థితుల్లో అక్టోబర్2కే విడుదల చేయాలని చాలా ప్రెస్టేజస్గా తీసుకుంటున్నారు చిత్ర యూనిట. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ కోసం నానాతంటాలు పడుతున్నారు చిత్ర టీమ్ అదేమనగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కర్నూలు లో చెయ్యాలని నిర్ణయించారు. ఎందుకంటే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అక్కడ పుట్టిపెరిగారు. వారు కర్నూలు వాసులు కావడంతో అక్కడ చెయ్యాలనుకున్నారు. కాని వారికి పోలీస్ ప్రొటక్షన్ దొరకడం కష్టమయిపోయింది. పోలీస్ డిపార్ట్ మెంట్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పడంతో హైదరాబాద్‌లోనే ప్లాన్ చేసుకుందామనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇక్కడ కూడా వాతావరణం అనుకూలించడంలేదు. ఎందువల్లనంటే అసెంబ్లీ మొదలవడంతో పోలీసులందరూ దాదాపుగా అక్కడే ఉండడంతో ఇక్కడ కూడా హ్యాండ్ ఇచ్చారు. ప్రీరిలీజ్‌ను ఈ నెల పద్దెమిదిన అని ముందు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వాల్ల దాన్ని మరో రెండురోజులకు వాయిదా వేస్తున్నారు. సినిమాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అక్టోబర్ 2నే విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. ఇక ఇవన్నీ కారణాల వల్ల టెక్నికల్‌గా వచ్చే ఇబ్బందుల వల్లే అని సినిమాను వాయిదా వేశారు. ఇటు టెక్నికల్‌గాను అటు వాతావరణం ఎందుకో ఏదీ అనుకూలించట్లేదని అనుకుంటున్నారు కొందరు. ఏది ఏమైనప్పటికీ వార్ కి సిద్ధం అంటున్న సైరా టీమ్.