Whistle Press Meet
`విజిల్` చిత్రాన్ని మహిళలకు అంకితమిస్తున్నాను – డైరెక్టర్ అట్లీ
తమిళ స్టార్ హీరో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం `విజిల్“. పోలీస్(తెరి), అదిరింది(మెర్సల్) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా `బిగిల్`. నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరాం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని `విజిల్`గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీపావళి సందర్బంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…
వర్ష మాట్లాడుతూ – “విజిల్ మూవీ నాకు చాలా స్పెషల్. నేను ఇందులో ఓ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తాను. ఈ పాత్ర చేయడానికి చాలా కష్టపడ్డాను. విజయ్‌గారితో కలిసి నటించడం చాలా లక్కీగా భావిస్తున్నాను. ఆయన ఎందుకు అంత పెద్ద స్టార్ హీరో అయ్యారనేది ఆయన డేడికేషన్ చూస్తేనే నాకు అర్థమైంది. మంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ అట్లీ గారికి థ్యాంక్స్“ అన్నారు.
కదిర్ మాట్లాడుతూ – “విజయ్సార్తో కలిసి నటించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. గొప్ప అనుభవం. దర్శకుడు అట్లీ, నిర్మాతలకు థ్యాంక్స్“ అన్నారు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ కొనేరు మాట్లాడుతూ – “తమిళంలో ఇప్పుడు బిగిల్‌కు ఎంత క్రేజ్ ఉందో తెలుగులో విజిల్‌కు అంతే క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. ఇదేదో తమిళ సినిమా అనో.. దక్షిణాది సినిమా అని చెప్పడం కంటే ఇండియన్ సినిమా అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. ఇందులో కంటెంటే కింగ్. విజయ్‌గారు, అట్లీగారు గత చిత్రాల ద్వారా తెలుగులో మంచి ఆదరణను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్కి, అఘోరామ్కి, అర్చనగారికి థ్యాంక్స్“ అన్నారు.
డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ – “నేను అట్లీగారి సినిమాలకు పెద్ద ఫ్యాన్‌ని. ఆయన డైరెక్ట్ చేసిన రాజా రాణి సినిమా నుండి ప్రతి సినిమాను చూస్తూనే ఉన్నాను. విజయ్‌గారితో ఆయన చేసిన సినిమాలకు తెలుగులో పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. విజిల్ సినిమా ట్రైలర్ చూడగానే గూజ్‌బామ్స్ వచ్చాయి. అట్లీగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అర్థమైంది. అట్లీగారి కెరీర్ బెస్ట్ మూవీగా ఇది నిలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ సినిమాలను తెరకెక్కించే అట్లీగారు .. కమర్షియల్ అంశాలతో పాటు హై ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాను ఎంటైర్ ఇండియాలోని ప్రేక్షకులు అభినందిస్తారు. అందులో అంత బలమైన కాంటెస్ట్ ఉంది. ఓ రైటర్‌గా, డైరెక్టర్‌గా కంటే.. ఓ ఫ్యాన్‌గా `విజిల్` సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే అట్లీగారు త్వరలోనే షారూక్ ఖాన్‌తో సినిమా చేయబోతున్నారు. నేను షారూక్ అభిమానిగా ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నాను. నిర్మాత మహేష్ నాకు కంటెంట్ రైటర్ నుండి పరిచయం ఇప్పుడు తను నిర్మాతగా మారాడు. తనకు ఆల్ ది బెస్ట్“ అన్నారు.
డైరెక్టర్ అట్లీ మాట్లాడుతూ – “నేను తెలుగులో సినిమా చేయాలని చాలా కాలంగా కల కంటున్నాను. త్వరలోనే ఆ కల నేరవేరనుంది. ఎన్టీఆర్‌గారు చాలా మంచి హృదయమున్న వ్యక్తి. నా ప్రతి సినిమాకు ఆయన ఫోన్ చేసి అభినందిస్తుంటారు. నాపై చూపిస్తున్నప్రేమకు థ్యాంక్స్. ఈ కారణంగానే నేను తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పగా ప్రేమిస్తారు. దాన్ని వెలకట్టలేం. ఇక విజిల్ విషయానికి వస్తే ఈ సినిమాను తెలుగులో 700 థియేటర్స్‌లో విడుదల చేస్తుండటం గొప్పగా అనిపిస్తుంది. నిర్మాత అఘోరామ్ సార్‌కి థ్యాంక్స్. నేను ఏదడిగినా అది ఇచ్చారు. తర్వాత నా బ్రదర్ విజయ్ అన్నకు థ్యాంక్స్. ఆయన లేకుండా నేను లేను. ఆయన వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. విజయ్ అనేది యాక్షన్ డ్రామా ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ మూవీ. కేవలం ఫుట్ బాల్ స్పోర్ట్ మాత్రమే కాదు.. చాలా ఎమోషన్స్‌ను క్యారీ చేస్తుంది. అలాగే స్త్రీ సాధికారతను తెలియజేస్తుంది. ఈ సినిమాను మహిళలకు అంకితమిస్తున్నాను. ప్రస్తుత సమాజంలో మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ విషయాలు నన్నెంతో బాధించాయి. ఆ కారణాలతో నేను విజిల్ కథను రాశాను. ఈ సినిమా మహిళలు గురించి చెబుతుంది. ఈ సినిమా తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. ప్రతి మహిళ, పురుషుడు ఈ సినిమాను చూడాలి. విజయ్‌లాంటి సూపర్‌స్టార్‌తో ఓ కమర్షియల్ సినిమా చేసేయవచ్చు. కానీ నేను ఈ సినిమాతో సోసైటీకి ఏదో చెప్పాలనుకున్నాను. ఈ సినిమాను మహిళల కోసమే చేశాను. ఫుట్‌బాల్‌కు మన దేశంలో పెద్ద ఆదరణ లేకపోయినా..ఈ సినిమా చూస్తే ఓ పాజిటివిటీని ప్రేక్షకులు తమతో తీసుకెళతారని చెప్పగలను. ఎ.ఆర్.రెహమాన్‌గారికి థ్యాంక్స్. నయనతారకి థ్యాంక్స్. అలాగే 12 మంది లేడీస్ ఫుట్‌బాల్ ఆటను ఆడారు. ప్రతి ఒక క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది. మహేష్‌గారికి థ్యాంక్స్“ అన్నారు.