Yuva Sudha Arts Office formally launched in Hyderabad

హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైన యువ సుధ ఆర్ట్స్ ఆఫీస్
పదిహేనేళ్లకు పైగా పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూటర్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు మిక్కిలినేని సుధాకర్. ఇప్పుడు ఆయన భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగా మారుతున్నారు.అందులో భాగంగా యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ ఆఫీసు ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. మన టాలీవుడ్ స్టార్స్‌తో పలు భారీ బడ్జెట్ చిత్రాలను యువ సుధ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు.