కాంగ్రెస్ నేత, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు.
కాంగ్రెస్ నేత, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు.
గ్రేటర్ హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ మాస్ లీడర్ గా మంచి గుర్తింపు పొందారు.
హైదరాబాద్ లో వేళ్ళ మీద లెక్కించదగ్గ కాంగ్రెస్ నాయకులలో ముఖేష్ గౌడ్ ఒకరు.
యూత్ కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగ్రేటం
తర్వాత కౌన్సిలర్ గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించిన దివంగత నేత హైదరాబాద్ ప్రజలకు సుపరిచితుడు.
ముఖేష్ గౌడ్ జూలై 1,1959లో జన్మించారు.
ఆయనకు ఇద్దరు కుమారులు విక్రమ్ గౌడ్, విశాల్ గౌడ్, ఒక కుమార్తె శిల్పా ఉన్నారు.
అతి చిన్న వయసులో 1986లో కౌన్సిలర్ గా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం.
1988లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా,
1989,2004లో మహారాజ్ గంజ్ ఎమ్మెల్యేగా,
2009 గోషామహల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1994 ,1999 ,2014 ,2018 అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయారు.
2007లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా,
2009లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ముఖేష్ గౌడ్ పనిచేశారు.