కాజల్‌కు ఒకే రోజు రెండు..

కాజల్‌కు ఒకే రోజు రెండు..
.
స్వామి రారా, కేశవ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి సుధీర్ వర్మ ఇపుడు తెలుగులో శర్వానంద్ హీరోగా రణరంగం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా కాజల్ నటిస్తున్నది..ఈ సినిమా ఆగష్టు 15 న రిలీజు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా తమిళ్ లో జయం రవి హీరోగా కోమలి సినిమా చేస్తున్నది. ఆగష్టు 15 న రిలీజవుతున్న ఈ సినిమాపై తమిళంలో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు , తమిళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కాజల్ నటించిన రెండు సినిమాలు, రెండు భాషల సినిమాలు ఒకే రోజు రిలీజవడం విశేషం. ఇందులో ఏ సినిమా హిట్ అయినా కాజల్ అగ్రకథానాయికగా కొంతకాలం కొనసాగగలదని సినీ వర్గాల వారి అంచనా.. కాజల్ కోరిక కూడా….