గురువును కిందకు నెట్టేసిన శిష్యుడు
గురువును కిందకు నెట్టేసిన శిష్యుడు
ఏపీ సీఎం గురువును మించిన శిష్యుడయిపోయారు. ఎన్నికల ముందు సలహాలతోపాటు, ఎన్నికల వైతరణి దాటేందుకు ఆర్ధిక సాయం చేసిన రాజకీయ గురువు, తెలంగాణ సీఎం కేసీఆర్ను ‘అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంల’ జాబితాలో ఏపీ సీఎం జగన్ దాటేశారు.
విడిపి అసోసియేట్స్ ‘మోస్ట్ పాపులర్ సీఎం ఎవరన్న’దానిపై నిర్వహించిన సర్వేలో ఓడిషా సీఎం పట్నాయక్ అగ్ర స్థానంలో నిలిచారు.
అయితే, రెండు నెలల క్రితమే అధికారంలోకి వచ్చి, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ సీఎం జగన్ మూడవ స్థానం దక్కించుకోగా.. ఆయన సీఎం అయేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన రాజకీయ గురువైన తెలంగాణ సీఎం కేసీఆర్కు మాత్రం ఐదవ స్థానమే దక్కడం విశేషం. దీన్నిబట్టి తెలంగాణలో కేసీఆర్ ఇమేజీ క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది.
దేశ వ్యాప్తంగా 71 శాతం మంది జగన్ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారని ‘దేశ్కా మూడ్’లో తేలిందట. నవరత్నాల పథకాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయని పేర్కొంది. ఇది జగన్ అభిమానులు, వైసీపీ నేతలకు శుభవార్తనే.