డేటింగ్ చేసే టైం లేదు…
డేటింగ్ చేసే టైం లేదు…
గీతగోవిందం తరువాత అదే హిట్ కాంబినేషన్లో రూపొందుతున్న డియర్ కామ్రేడ్ సినిమా శుక్రవారం రిలీజు కానుంది.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన ఇంటర్యూలో ఆ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ…“ గీతగోవిందం హిట్ అయిందని మళ్ళీ అదే కాంబినేషన్ లో చేయడం లేదు .. భరత్ కమ్మ కథ నచ్చి మాత్రమే చేస్తున్నా“..విజయ్ దేవరకొండతో డేటింగ్ పుకార్లు గురించి మాట్లాడుతూ..“ కొత్త సినిమాల కోసం ప్రిపేర్ కావడంతోనే టైమ్ అంతా గడిచిపోతుంది..జిమ్ కు వెళ్ళడం, షూటింగ్‌లు చేయడం, కథలు చదవడం, ఒక్కోసారి తినడం కూడా మరిచిపోతున్నా.. డేటింగ్ చేసే టైం ఎక్కడిది.. విజయ్ దేవరకొండతోనే కాదు.. ఎవరితోనూ డేటింగ్లో లేను.. ప్రస్తుతం నేను ఒంటరినే..“ అని తేల్చేసింది రష్మిక…
మహేష్‌బాబుతో `సరిలేరు నీకెవ్వరు`, తమిళంలో కార్తీ తో ఒక సినిమా, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో రూపొందనున్న సినిమాతో పాటుగా మరో మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి..ఈ అవకాశాలు అన్నీ అద్రుష్టం వల్ల రాలేదు.. నా హార్డ్‌వర్క్ వల్ల మాత్రమే వచ్చాయని రష్మిక మందన్న అభిప్రాయపడ్డారు..