నటుడు శివాజీకి టైం బాగాలేదు…
నటుడు శివాజీకి టైం బాగాలేదు…
సినీ నటుడు,రాజకీయ విశ్లేషకుడు శివాజీని దుబాయ్ ఎయిర్‌పోర్టు అధికారులు అడ్డుకున్నారు… హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు వెళ్లిన శివాజీనీ అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను హైదరాబాద్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు… శివాజీ.. దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం…
గతంలో అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీపై హైదరాబాద్ పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేసారు.. ఆ సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు వెళ్లేందుకు శివాజీ యత్నించగా హైదరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే…అయనను దేశం దాటి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు.. అయితే ప్రస్తుతం ఆయనపై ఉన్న ఆంక్షలను పోలీసులు తొలగించారు… ఈ క్రమంలో శివాజీ దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లేందుకు యత్నించారు. కానీ దుబాయ్ అధికారులు ఆయన్ను అడ్డగించి వెనక్కి పంపించేశారు.
ఇదిలాఉండగా.. ఈ వ్యవహారంపై సీపీ సజ్జనార్ శివాజీపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. దుబాయ్ పోలీసులు ఆయన్ను ఎందుకు ఆపారో తెలియదన్నారు…కారణాలు తెలియాల్సి ఉంది..త్వరలో తెలియవచ్చు…