నితిన్‌కు రష్మిక ప్రేమపాఠాలు…
నితిన్‌కు రష్మిక ప్రేమపాఠాలు…
ప్రస్తుతం డియర్‌కామ్రేడ్ చిత్రం బిజీలో ఉన్న రష్మిక మరోవైపు నితిన్‌కి ప్రైవేట్ క్లాసులు తీసుకుంటోంది. నితిన్‌కు ట్యూషన్ చెప్పే బిజీలో ఉంది ఈ కన్నడ భామ. అయితే ఇది కూడా సినిమాలో భాగమే. వీరిద్దరి కాంబినేషన్లో భీష్మ అనే చిత్రం తెరకెక్కుతోంది. వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్‌కు పాఠాలు చెప్పే టీచర్‌గా రష్మిక కనిపించబోతోంది. అయితే అది కాసేపు మాత్రమే. సినిమాలో ఆ ఎపిసోడ్ ఎందుకుంది, అసలు రష్మిక పాత్ర ఏంటనేది సస్పెన్స్.
నితిన్ మాత్రం అమ్మాయిలకు దూరంగా ఉండే పాత్రలో పోషిస్తున్నట్లు సమాచారం. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం పై నితిన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. లై, ఛల్మోహనరంగ, శ్రీనివాసకళ్యానం ఇలా వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో కాస్త గ్యాప్ ఎక్కువే తీసుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత భీష్మతో కనిపిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మరి ఇక ఈ చిత్రం ఎలాంటి హిట్ ఇస్తుందో. రష్మిక కాంబినేషన్ ఏమన్నా కలిసొస్తుందేమో చూడాలి.