మన్మధుడు-2 టైటిల్ ఎలా వచ్చిందంటే…?
మన్మధుడు-2 టైటిల్ ఎలా వచ్చిందంటే…?
అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ జంటగా నటించిన చిత్రం మన్మధుడు-2 ఈ చిత్రానికి ఎంత క్రేజ్ ఉందన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వయెకామ్, స్టూడియోస్, అన్నపూర్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ఆనికి రాహుల్‌రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా విలేకలరుల తో రాహుల్ పంచుకున్న ముచ్చట్లు….
రీమేక్ అనగానే నాగార్జునగారు నేను భయపడ్డాను అన్నారు. కాని భయపడలేదు ఫ్రీమేక్ కాదుకదా అన్నాను అంతే. అఫీషియలేనా అని అడిగాను. అంతా అందులో ప్రత్యేకించి భయపడింది అంటూ ఏమీలేదు. ఆ టైం అంతా అయిపోయింది రాహుల్. ఈ సినిమాకి కూడా డబ్బులు ఇచ్చి రైట్స్ కొన్నాం. అన్నపూర్ణ సెటప్ గురించి ఆల్రెడీ తెలుసు మంచి ఎతిక్స్ ఉన్న బ్యానర్ . ఈ టైటిల్ అంటే మా టీమ్ నుంచి వచ్చింది. ఎవరు అన్నది ప్రత్యేకించి గుర్తులేదు బట్ టీమ్ నుంచి వచ్చిన టైటిల్. ఈ కథకి ఎక్కడో కామడీ జోనర్ అనేది యాప్ట్ కాబట్టి అలా పెట్టాం. ఇక మన్మధుడు -2 అన్నదైతే ఒకే టైటిల్‌తో సేమ్ యాక్టర్ కన్ఫ్యూజ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో 2 అని పెట్టాం. మన్మధుడు కన్నా బెటర్ సినిమా అని చెప్పలేం కాని ఆ సినిమాకి ఒక ప్రత్యేకత అనేది ఉంది. నాకు కూడా ఆ సినిమా చాలా బాగా నచ్చింది.
నాకు ఈ కథ పై నమ్మకం ఎక్కడో ఆడియన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అయిపోయి ఈ సినిమాని ఈ సినిమాలాగా చూస్తారు అని చిన్న నమ్మకం. ఒక ఫ్రంచ్ సినిమాని చిన్న చిన్న మార్పులు చేసి చేసిన చిత్రమిది. ఈ సినిమాలో సమంత ఒక సీన్ చేసింది. ఆ సీన్ మైండ్లోకి రాగానే ముందునాకు తట్టిన యాక్టర్ సమంతనే. నాకు అనిపించిన తర్వాత తనకు చెప్పాను ఓకే అంది. ఆ తర్వాత నాగ్ సార్‌కి చెప్పాను ఆయన ఓకే చాలా బావుంది బట్ సమంత చేస్తుందా అని అడిగారు. ఆయనకు చెప్పాను నేను అడిగాను ఓకే అన్నారు అని అయితే ఓకే అన్నారు. నాకు సినిమా బావుంటుందని ఎలాగైన నేను చెయ్యాలని గీత గారు చెప్పారు. చిలసౌ చూసి నాగార్జున గారు నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఒకసారి సినిమా చూడు నీకు నచ్చితే చేద్దాం అన్నారు. వెంటనే నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. నా రెండో సినిమానే నాగ్ గారు హీరో అంటే అమేజింగ్ ఫీలింగ్ అనిపించింది. ఇది చాలా హ్యాపీ సినిమా ఫుల్ ఎంటర్టైన్ మూవీ. నాగ్గారికి కూడా హ్యాపీ మూవీస్ ఎక్కువగా ఇష్టపడతారు. సర్ చాలా చిల్డ్ అవుట్‌గా ఉంటారు. అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉండేవారు.