లోకేష్ జలయాత్ర…
లోకేష్ జలయాత్ర…
గోదావరి వరద ముంచెత్తడంతో వందల గ్రామాల జలదిగ్బంధంలో చిక్కుకున్నా, ముఖ్యమంత్రి మాత్రం తన వ్యక్తిగత పర్యటనలకే ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మర్శించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల వైపు కన్నెత్తి చూడకుండా జెరూసలేం కుటుంబంతో వెళ్లిన ముఖ్యమంత్రి ..పర్యటన ముగిశాక కూడా బాధితుల వైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయమన్నారు. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో చేసిన పీపీఏల రద్దు, పోలవరం టెండర్ల రద్దు విషయంలో కేంద్రం ఆగ్రహంగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు వరద బాధితులను గాలికొదిలేసి ఢిల్లీకి సీఎం పరిగెత్తారని లోకేశ్ ఆరోపించారు.
ఇబ్బందులు, అందుతున్న సహాయం పై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాలకొల్లులో మీడియాతో నారా లోకేశ్ మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం కమిటీలు, కమిషన్లతో కాలయాపన చేస్తుందే తప్పించి పాలన చేతగావడంలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు తమ పాలనా వైఫల్యాలను తెలుగుదేశం పార్టీపైకి నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారని అన్నారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద వస్తుందని ఈ ప్రభుత్వానికి తెలియదా ? అని లోకేశ్ ప్రశ్నించారు. కనీసం ముంపు ముప్పు ఉంటుందని ఆయా ప్రాంతాల వారికి హెచ్చరికలు చేసే వ్యవస్థ కూడా ఈ ప్రభుత్వం వద్ద లేదా అని నిలదీశారు. ముంపువాసులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస శిబిరాల ఏర్పాటు వంటివి ఎందుకు చేయలేదన్నారు. గత ఐదేళ్లలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ స్థాయి అధికారుల నుంచి సీఎంవో వరకూ అప్రమత్తం చేసి.. విపత్తుల నష్టం తగ్గించడంలోనూ, ప్రాణ నష్టం లేకుండా చూడటంలోనూ సఫలమయ్యారని, ఇప్పుడు అదే అధికార యంత్రాంగం ఉంది కదా? వరద అంచనా వేయడంలోనూ, ముందస్తు చర్యలు తీసుకోవడంలోనూ ఇంత దారుణంగా ఎందుకు విఫలమయ్యారో సీఎం జవాబు చెప్పాలన్నారు. వారం రోజుల నుంచి గ్రామాలు మునిగిపోయి, పూర్తిగా అంధకారంలో ఉన్నా పట్టించుకున్న నాధుడు లేడని ఆరోపించారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలొనే 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఒక్కో రైతుకి 10 వేల నుండి 15 రూపాయల మేరకు పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ఒక్కో రైతుకు ఎకరానికి కనీసం 10 వేల సహాయం అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాలకు తక్షణసాయంగా అందించాల్సిన రేషన్ సరుకులు కూడా అందివ్వలేకపోయారని అన్నారు.
అమరావతి ఆలోచనే లేని సీఎం
అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఖరిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ అమరావతి నిర్మించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అందుకే నిధులు అవసరంలేదని నేరుగా ప్రధాని మంత్రికే ముఖ్యమంత్రి జగన్ చెప్పారని అన్నారు. అమరావతి ప్రజా రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పిపిఏలు, పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెడుతున్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని, తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా వైకాపా డ్రామాలు ఆడుతోందని లోకేశ్ సమాధానం ఇచ్చారు.