వెబ్ చిట్‌చాట్‌తో.. కరీనా

వెబ్ చిట్‌చాట్‌తో.. కరీనా
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ‘వీరే డీ వెడ్డింగ్’ తర్వాత ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడు తారలంతా సినిమాలతో పాటు డిజిటల్ మీడియాలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. అందులో చాలా మంది బాలీవుడ్ తారలు ఉన్నారు. ఆ జాబితాలో కరీనా కపూర్ ఖాన్ కూడా ఉండబోతుంది. ఇదే ఈమె తొలి డిజిటల్ ప్రాజెక్టు అయినా విభిన్నంగా ఉండేలా జాగ్రత్త పడింది. ఇప్పుడు వరకూ డిజిటల్ మీడియాలో నటిస్తున్న వారంతా ఏవో వస్తున్న కథలనే చేసుకుంటూ పోతున్నారు. కానీ కరీనా మాత్రం కొత్తగా ఆలోచించింది. చిట్ చాట్లా ఉండే ఓ వెబ్ షోను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సామాజిక అంశాలతో కూడిన షో చేస్తే బాగుంటుందని తన శ్రేయోభిలాషులంతా ఇదివరకే వివరించారట. ఆ కోణంలో వచ్చిన ప్రాజెక్టులనే కరీనా కూడా వింటోంది. ఓ దర్శకుడు చేసిన నరేషన్ మాత్రం ఆమెను మెప్పించిందట. త్వరలో ఈ వెబ్ చిట్ చాట్ షో ప్రారంభించబోతున్నారు. గత ఏడాది మహిళలు ఎదుర్కొన్న సమస్యలపై ఆమె రేడియో షో కూడా చేశారు. ఇప్పుడు కరీనా భర్త సైఫ్ అలీఖాన్ డిజిటల్ రంగంలో సక్సెస్ కావడంతో ఈమె కూడా అదే బాటలో రాణించాలని భావిస్తోంది