15ఏళ్ల తర్వాత తెరపైకి హిట్ కాంబినేషన్
15ఏళ్ల తర్వాత తెరపైకి హిట్ కాంబినేషన్
మెగాస్టార్ చిరంజీవి – లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ అంటే అప్పటిలో ఒక క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే అప్పటిలో ప్రేక్షకులు ఎగబడి చూసేవారు. అయితే ఆ తరువాత విజయశాంతి సినిమాలకు దూరం కావడంతో వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇద్దరు పొలిటికల్ గా బిజీ అయ్యిపోయారు. అయితే చిరు పొలిటికల్ గా బిజీగా ఉంటూనే సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యి సినిమాలు చేస్తున్నాడు. అలానే విజయ శాంతి కూడా సినిమాలు చేయాలనీ డిసైడ్ అయింది.
ఒకప్పటి హిట్ పేర్ గా నిలిచిన చిరంజీవి-విజయశాంతి మళ్లీ కలిసి నటించబోతున్నారనే వార్తా మెగా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. 2004 తర్వాత వీరిద్దరి కాంబినేషన్లలో ఇప్పటివరకు సినిమాలు రాలేదు. అంటే దశాబ్దంన్నరగా వీరి కలుకయికలో సినిమా అన్న ముచ్చటే లేదు. వీరిద్దరి కలుయికలో వచ్చిన చివరి చిత్రం మెకానిక్ అల్లుడు. ఈ సినిమా టైములోనే వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో ఆ తర్వాత వీరు కలిసి నటించలేదని ఓ రూమర్ కూడా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవమో తేలీదు కానీ సినీ వర్గాల్లో మాత్రం రకరకాల గాసిప్స్ చక్కర్లు కోడుతుంటాయి.
ఇకపోతే ఇంత కాలం తర్వాత విజయశాంతి నటించాలి అని అలా అనుకుందో లేదో వెంటనే ఆమెకు మహేష్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సరిలేరు నీకెవ్వరూ తో విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విజయశాంతి కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అంతే మన మేకర్స్ కి ఓ ఆలోచన వచ్చింది. చిరు-విజయశాంతి కాంబినేషన్లో ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందని పలువురికి బుద్ది పుట్టింది. చిరు ఇంకా హీరోగా నటిస్తున్నారు కనుక వీరిద్దరూ కలసి జంటగా కనిపించే అవకాశం లేదు.
కాకపోతే సమవుజ్జీలయిన పాత్రలకి తీర్చిదిద్దితే ఆ సినిమా ఒక ఊపు ఊపేస్తోంది. త్వరలోనే వీరి కాంబినేషన్లో మూవీ చూడొచ్చని అంటున్నారు. మరి చిరు తర్వాత కొరటాలతో ఓ సినిమా చేస్తున్నాడు. అందులో అది సాధ్యపడుతుందో లేక త్రివిక్రమ్ ఈ కలయికని తెరపైకి తెస్తాడో తెలియదు. అలాగే బాలకృష్ణ సినిమాలో కూడా విజయశాంతి నటించే అవకాశం ఉందని చెబుతున్నారు.