ప్రతిభకు గీటు రాయి కె.వి. రెడ్డి
ప్రతిభకు గీటు రాయి కె.వి. రెడ్డి
దర్శక పితామహుడు కె.వి.రెడ్డిగారిని ప్రేమగా కె.వి. అని పిలిచే వారట. కె.అంటే కళ, వి. అంటే వ్యాపారం, అనేవారట. సినిమా కళను వ్యాపారంగా తీర్చిదిద్ది, నిర్మాతకు కాసుల వర్షం కురిపించిన ఘనుడాయన. భారతదేశంలో నిర్మించబడ్డ సినిమాల్లో అత్యుత్తమమైన వంద చిత్రాలను ఎంపిక చేస్తే, అందులో మాయాబజార్ ప్రధమస్థానంలో నిలిచిన కీర్తి, తెలుగువాడి కిరీటంలో కలికితురాయి. తెలుగు సినిమాని, సరళమైన భాషలో సామాన్యడి మేధస్సుకు దగ్గరగా, వినోదమనే పంచదార అద్ది రసగుళికగా అందించిన ప్రతిభాశాలి కె.వి. రెడ్డి కథాచర్చలో ఎవరైనా ఆశయాలు, ఆర్భాటాలకు పోయి, ప్రేక్షకుడి స్థాయిని మించి మాట్లాడితే, టేబుల్ పై ఒక పావలా బిళ్ళ (అప్పట్లో రూపాయిలో నాలుగో వంతు)ని వుంచి దాన్ని చూసి మాట్లాడమనే వారట. అంటే పావలా టికెట్‌కొనే ప్రేక్షకుడి స్థాయిలోనే చిత్రం ఉండాలని ఆయన భావన. ఎంతోమంది దర్శకులకు కె.వి. రెడ్డి ఆదర్శం, మార్గదర్శకుడు. ఈయన కోసం అన్నపూర్ణ సంస్థ ఆ రోజుల్లోనే ఒక సంవత్సరం పాటు వెయిట్ చేసి దొంగరాముడు సినిమాను తీయించుకున్నారు. కథ మొత్తం రెడీ కాగానే, బడ్జెట్, నిడిfr, తారాగణం, లొకేషన్లు, గెటప్స్, కాస్ట్యూమ్స్ అన్నీ పక్కాగా ప్లాన్ చేకసుకునే చిత్రీకరణకు దిగేవారు. ఖర్చులో ఎక్కడా వేస్టేజి ఉండేది కాదు. ప్రతిభను గుర్తించి, వ్యక్తిని వాడుకోవడంలో కూడా కె.వి.రెడ్డి ఘనాపాటి. డి.వి.నరసరాజు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరదామని, కె.వి. రెడ్డి ఘనాపాటి డి.వి. నరసరాజు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరదామని, కె.వి. చుట్టూ తిరుగుతున్నాడట. అతన్నే పెద్ద మనుషులు సినిమాకు రైటర్ని చేసి సంభాషణలు రాయించారు. తదుపరి నరసరాజు, గొల్లపూడి చెప్పినట్టుగా He became a writer for writers.
కె.వి.రెడ్డి దర్శకుడైనా, దర్శకత్వ వ్యవహారాలు మాత్రమే చూస్తూ కూచోరు. నిర్మాణం కూడా చూసుకునేవారు. ‘భక్తపోతన’ హిట్ కావడంతో, వాహినికి ఒక సినిమా, బి.ఎన్. ఒక సినిమా కె.వి. చేసేలాగా ఒప్పందం కుదర్చుకున్నారు. 1946లో బి.ఎన్.రెడ్డి ‘స్వర్గసీమ’ తీశారు. యుద్ధం రోజులు, ఉన్నవాళ్లు ఉంటూ వెళ్లిన వాళ్లు వెళ్తూ ఉండంతో సినిమా పరిశ్రమ అస్తవ్యస్తమైంది, వాహిని సంస్థ వెంటనే చిత్రం తియ్యలేకపోయింది. ఆలోగా నాగయ్య తానుగా ‘త్యాగయ్య’ ఆరంభించి, తానే దర్శకత్వం వహించి, 1946లో విడుదల చేస్తే అదే అఖండ విజయం సాధించింది. కె.వి.రెడ్డి నాగయ్యకి సరిపోయే మరో పాత్రని తీసుకుని ‘యోగివేమన’ (1947) నిర్మించారు. తాను దర్శకుడైనా, కూడా, ‘స్వర్గసీమ’కి నిర్మాణశాఖలో పనిచేశారు కె.వి. ‘యోగివేమన’ వేదాంతపరమైన సినిమా కావడంతో, ప్రజ అర్థం చేసుకోలేదు. సినిమాకి కాసులు రాలకపోయినా, కానుకలు వర్షించాయి. ప్రపంచం మీద అన్ని భాషల చిత్రాల్లోనూ ఉన్న క్లాసిక్స్‌లో ‘యోగివేమన’ కూడా జమ చెయ్యబడింది. కె.వి మేధాశక్తి, ఆలోచన, దృశ్యకల్పన – అన్నీ వేమన చూపించింది. ‘‘నిస్సందేహంగా కె.వి.రెడ్డి తీసిన అన్ని చిత్రాల్లోనూ ‘యోగివేమన’ మిన్న’ అని మేధావులు, సినిమా విశ్లేషకులూ కీర్తించారు. వేమన వల్ల వాహినికి ధనదృష్టి కలగకపోవడంతో, అప్పుడు జానపద చిత్రాలు ముమ్మరంగా ఉన్నాయి గనక, అలాంటి చిత్రం తియ్యాలని వాహినికి ‘గుణసుందరికథ’ (1949) నిర్మించారు కె.వి.రెడ్డి. కొత్తకథతో, సెంటిమెంట్‌తో ‘గుణసుందరికథ’ ఆపామర పండితాన్ని మెప్పించి కాసులు పండించింది. భక్తి తియ్యాలన్నా, వేదాంతం తియ్యాలన్నా, వినోదం తియాలన్నా కె.వి.రెడ్డి సర్వసమర్థుడు అని పరిశ్రమ చెప్పుకుంది. వేమనకీ, గుణసుందరికీ రామ్‌నాథ్ లేరు. కె.వి., కమలాకర కామేశ్వరరావు కథా చర్చలు చేసి, స్క్రీన్‌ప్లే రచించారు.