మనిషేనా… 30 ఏళ్ళలో 250 చిన్నారుల పై
మనిషేనా… 30 ఏళ్ళలో 250 చిన్నారుల పై
చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణాలపై సమాజం కలతచెందుతోంది. ‘అసలు వీళ్లు మనుషులేనా వీరికి మానవత్వం లేదా’ అంటూ నిందితులపై ఆక్రోషం వెల్లగక్కుతున్నారు. నింధితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా ప్రజా సంఘాలు ఆక్రందనను వ్యక్తం చేస్తున్నాయి. కన్నుమిన్ను కానకుండా కామాంధులుగా తయారవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. వావి వరసలు లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న వరంగల్ లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నుంచి తేరుకోక ముందే ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనర్ బాలికపై సామూహిత అత్యాచారం ఘటన వెలుగుచూసింది ఇదిలా ఉంటే…
పశ్చిమ ఫ్రాన్స్‌లోని లా రోషల్ నగరానికి చెందిన జోయెల్ లే స్కార్నెక్ అనే వైధ్యుడు నరరూప రాక్షసుడిగా మారాడు. గత 30 ఏళ్లుగా తన వద్దకు వైద్యం కోసం వచ్చిన ఆరేళ్ల లోపు చిన్నారుల పై అఘాయిత్యాలకు పాల్పడినట్లు తేలింది. అంతే కాకుండా వారి వివరాలను డైరీలో రాసుకోవడం అతని రాక్షసత్వానికి నిదర్శనతంగా మారింది. 30 ఏళ్లలో దాదాపు 250 చిన్నారులను లైంగికంగా వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక మనిషిలో ఇంతటి పైశాచికం ఎలా వస్తుందో అర్ధం కావడంలేదు. పైగా ప్రాణాలు పోసే ఒక డాక్టర్ ఇలాంటి పని ఎలా చెయ్యగలిగాడు అన్నది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన అభం శుభం ఎరుగని పసికందులను ఎలా వారి జీవితాలను నాశనం చెయ్యాలనిపించింది. ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడిన వాళ్ళ పై కఠిన చర్యలు తీసుకోవాలి.
సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ బాలికల తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక పోవడం కూడా ఓ కారణమనిపిస్తుంది. ఈ రోజుల్లో చిన్నారులైనా, పెద్దవారైనా తల్లిదండ్రులు వారి పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి వీలు లేదు. ఎవరి పిల్లలను వారే కాపాడుకోవాలి. మహిళలపై జరుగుతున్న ఘటనలు జగుప్సాకరమైన విషయమని.. సమాజం తలదించుకునేలా అగడాలు పెరిగిపోతున్నాయని మహిళా సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాని ఇలాంటివి ఎన్ని వెలుగులోకి వచ్చి ఎంత జరుగుతున్నా. ప్రభుత్వాలు దీని పై సరైన నిర్ణయం తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటే బావుంటుంది.