హిందువులు కాని వారు టీటీడీ నుంచి వెళ్లిపోవాలి -సీఎస్
హిందువులు కాని వారు టీటీడీ నుంచి వెళ్లిపోవాలి -సీఎస్
తిరుమల తిరుపతి దైవసన్నిధానంలో అన్యమత ప్రచారం అంశాన్ని లేవనెత్తారు కొందరు. తిరుమలలో అన్యమత ప్రచారం దుమారం రేపుతోంది. దీనికి సంబంధించి ఈ అంశం పై చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం స్పందించారు. టీటీలో పని చేస్తూ తాను హిందువును కాదనే వ్యక్తులు తిరుమల నుంచి వెళ్లిపోవాలని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. తరుమల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అంటూ బస్సు టికెట్ల వెనుక అస్యమత ప్రచారం పూర్తిగా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమని మండిపడ్డారు. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని, ఆర్టీసీ ఎమ్డిని ఆదేశించామని. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సీఎస్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఈ అంశంపై చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం స్పందించారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధమని, అన్యమతస్తులు తిరుమల నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని హెచ్చరించారు. తిరుమలలో పద్మావతి అతిథిగృహంలో టీటీడీ అధికారులలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సమావేశం అయ్యారు. ఆర్టీసీ బస్ టికెట్ల మీద అన్యమత ప్రచారానికి సంబంధించిన అంశంపై చర్చించారు. ‘తిరుమలలో బస్సు టికెట్ల మీద ఇతర మతాల ప్రచారం చాలా గర్హనీయం. ఇందులో ఆర్టీసీ నిర్లక్ష్యం కనిపిస్తోంది. వారు జాగ్రత్తగా ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇతర మతాలను వారు స్వీకరించడం వారిష్టం. టీటీడీలో పనిచేసే వారు ఎవరైనా ఇతర మతాల వారు ఉంటే ఆ విషయం చెప్పేసి వెళ్లిపోండి. ఉద్యోగంలో వారు కొనసాగడం కుదరదు. లేదా ప్రధాన బాధ్యతలు స్వీకరించడానికి కుదరదు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం శ్రేయస్కరం కాదు.’ అని ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టం చేశారు.
గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన అనుభవం వుండటంతో అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో, జేఈవో పాల్గొన్నారు. కొద్దిరోజుల క్రితం తిరుమల ఆర్టీసీ బస్టాండ్లో టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వాటి వెనుక ఇతర మతాలకు సంబంధించిన ప్రకటనలు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. నెల్లూరు నుంచి వచ్చిన టికెట్ రోల్స్ మార్చకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఇతర పార్టీ సంఘాలు ఆందోళనకు తెర లేపిన సంగతి తెలిసిందే.