Evvarikee Cheppoddu pre Release Event
‘ఎవ్వరికీ చెప్పొద్దు’ ప్రీరిలీజ్ ఈవెంట్
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేశ్ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్ దర్శకత్వంలో రాకేశ్ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్‌స్టోరీ ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబర్ 8న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా…
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ”మా జోష్ సినిమాలో రాకేష్ వర్క్ చేశాడు. తను యాక్ట్ చేస్తానని వచ్చినప్పుడు విదేశాల్లో చదువుకుని వచ్చావు. మంచి కెరీర్ ఉంది. ఇది నీకు అవసరమా అన్నాను. కొన్ని రోజుల తర్వాత నేను హీరోగా చేస్తున్నానని చెప్పాడు. సినిమా అంతా పూర్తయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. ఎవరు ప్రొడ్యూసర్ అని అడిగితే నేనే ప్రొడ్యూసర్ అని చెప్పాడు. సినిమా చూశాను. అంతా కొత్త టీమ్ పడ్డ కష్టం నాకు తెరపై కనపడింది. చాలా మంచి కాన్సెప్ట్ మూవీ. మంచి రిలీజ్ డేట్ కోసం 9 నెలలు వెయిట్ చేశారు. తను హార్డ్ వర్క్ చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ప్రమోషన్స్ కూడా తనే ప్లాన్ చేసుకున్నాడు. తన ప్యాషన్ కనపడింది. బసవ శంకర్ నేచురల్ పెర్ఫామెన్స్ తీసుకున్నాడు. మంచి హ్యుమర్ ఉంది. సినిమా చూసిన తర్వాత కచ్చితంగా నచ్చుతుంది. అక్టోబర్ 8న విడుదలవుతున్న ఈ సినిమాను అందరూ ఈ ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో, నిర్మాత రాకేష్ వర్రె మాట్లాడుతూ – ”చాలా ఎమోషనల్ జర్నీ. ఇందులో ముందుగా వినాయక్‌గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే.. బద్రినాథ్ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నా వెనక నిలబడ్డారు. అలాగే డైరెక్టర్ బాబీ డైరెక్టర్ కాకముందు నుండి నాకు తెలుసు. తనని చూసి ఇన్స్పైర్ అవుతుంటాను. తరుణ్ భాస్కర్‌కి థ్యాంక్స్. ఇక మా సినిమా విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ విజయ్‌కి, లిరిసిస్ట్ వాసు, డైరెక్టర్ శంకర్‌గారికి థ్యాంక్స్. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. అలాగే మా సినిమా రిలీజ్‌కు సపోర్ట్ చేస్తున్న దిల్‌రాజుగారికి థ్యాంక్స్. ఆయనొక గ్రేట్ పర్సన్. మా ప్రాజెక్ట్‌ని, డ్రీమ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాగే మా నాన్నగారికి కూడా థ్యాంక్స్. రిటైర్ అయిపోవాలని అనుకున్న ఆయన నా కోసం కష్టపడటం స్టార్ట్ చేశారు. నిజానికి ఈ సినిమాకు నేను హీరోని కాను.. మా నాన్నగారే హీరో. అక్టోబర్ 8న సినిమా విడుదలవుతుంది. సినిమాను ఎంజాయ్ చేస్తారని గ్యారంటీగా చెప్పగలను” అన్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – ”ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనడానికి నిదర్శనం దర్శకుడు శంకర్. ఫస్ట్‌టైమ్ స్టేజి మీద ఒక దర్శకుడు కొత్తగా, నిజాయితీగా మాట్లాడాడు. సినిమా కూడా అలాగే ఉంటుంది. రాకేష్ ‘బద్రినాథ్’లో ఒక మంచి క్యారెక్టర్లో నాతో పాటు ట్రావెల్ అయ్యాడు. మంచి పెర్ఫార్మర్. తను చిన్నప్పటి నుండి కోరుకున్న కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుంది. డెఫినెట్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాని ఓన్ చేసుకొని రిలీజ్ చేస్తున్న రాజన్నకి రాకేష్ తరపున థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా రాజుగారు చూసి బాగుందన్నప్పుడే ఈ సినిమా హిట్ అయ్యింది. నాకు ‘ఫిదా’లో సాయి పల్లవి పెర్ఫార్మ్ ఎంత ఎనర్జిటిక్, హుషారు అనిపించిందో ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్రంలోని హీరోయిన్ నాకు అలా అనిపించింది. తను చెప్పాలనుకున్నది సూటిగా, సుత్తి లేకుండా తీసిన దర్శకుడిని అభినందిస్తున్నా” అన్నారు.
చిత్ర దర్శకుడు బసవ శంకర్ మాట్లాడుతూ – ”ఈ చిత్రం ట్రైలర్ చూడండి. నచ్చితే సినిమా కూడా చూడండి. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నా” అన్నారు.
దర్శకుడు కె.ఎస్. రవీంద్ర మాట్లాడుతూ – ”ఎవ్వరికీ చెప్పొద్దు’ అని టైటిల్ పెట్టారు. కానీ రాకేష్ గురించి చెప్పాల్సినవి కూడా ఉన్నాయి. రాకేష్ నాకు యంగర్ బ్రదర్. తను అబ్రాడ్‌లో చదువుకున్నాడు. తను అనుకుంటే అక్కడే జాబ్ తెచ్చుకొని డాలర్స్ సంపాదించుకొని సెటిల్ అయిపోవచ్చు. కానీ సినిమా మీద ప్యాషన్‌తో హైదరాబాద్ వచ్చాడు. కొన్ని సంవత్సరాల నుంచి సినిమా మీద ప్యాషన్‌తో చాలీ చాలని డబ్బులతో ఇంట్లో అడగకూడదని సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఎంతో స్ట్రగుల్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయి తన సినిమాని ప్రొడ్యూస్ చేసుకుంటూ హీరోగా లాంచ్ అవుతున్నారు. ఐయం వెరీ హ్యాపీ రాకేష్. చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవారు. మన దగ్గర్నుంచి ఆస్తి కొట్టేయొచ్చు. నగలు, డబ్బులు అన్నీ కొట్టేయొచ్చు. కానీ మనం చదువుకున్న చదువు కొట్టేయలేరు అని. అలాగే మనదగ్గరున్న కాన్ఫిడెన్స్ కూడా ఎవరూ కొట్టేయలేరు. మంచి టీమ్‌ని పెట్టుకున్నావ్. సక్సెస్ వచ్చి తీరుతుంది. రాజుగారి లాంటి బేనర్ నీ సినిమా రిలీజ్ చేస్తుందంటే అక్కడే పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమాతో మీరు సక్సెస్ కొడతారు” అన్నారు.
చిత్ర సంగీత దర్శకుడు శంకర్ శర్మ మాట్లాడుతూ – ”తెలుగులో ఇది నా తొలి చిత్రం. రాకేష్ నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. నాకు అవకాశం ఇచ్చిన రాకేష్‌కి థాంక్స్” అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – ”డైరెక్టర్‌తో బసవ శంకర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నా ‘పెళ్ళిచూపులు’ సినిమాకు ఆయన డైరెక్షన్ టీమ్‌లో పనిచేశారు. మా యూనిట్‌కు షెడ్యూలింగ్ చేసేవారు. తను మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుతాడు. తను ఎలాంటి సినిమా డైరెక్ట్ చేస్తాడోనని నాకు ఎప్పుడూ ఓ ఆసక్తి ఉండేది. ఈ సినిమాలో క్యాస్ట్ గురించి టాపిక్ ఉంది. చాలా మంది ఇదొక కాంట్రవర్సియల్ టాపిక్ అని మాట్లాడరు. కానీ శంకర్‌గారు మంచి సినిమా చేయాలని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ను సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ గార్గేయి ఎల్లాప్రగడ మాట్లాడుతూ – ”ఇది నా ఫస్ట్ ఫిలిమే కాదు… స్పెషల్ మూవీ కూడా. చాలా మంచి టీమ్‌తో కలిసి పనిచేశాను. మంచి కథ, క్యారెక్టర్ ఉన్న సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. దిల్‌రాజుగారు మా సినిమాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. హారతి అనే క్యారెక్టర్ని నాకు ఇచ్చిన డైరెక్టర్ బసవ శంకర్‌గారికి థ్యాంక్స్. అలాగే నిర్మాతగారికి థ్యాంక్స్. ఇంత మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన నా టీమ్‌కు థ్యాంక్స్” అన్నారు.
నటీనటులు:
రాకేశ్ వర్రె
గార్గేయి ఎల్లాప్రగడ
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: బసవ శంకర్
నిర్మాత: రాకేశ్ వర్రె
రిలీజ్: శ్రీ వెంకటేశ్వర ఫిలింస్
కెమెరా: విజయ్ జె.ఆనంద్
సంగీతం: శంకర్ శర్మ
ఎడిటర్స్: బసవ శంకర్, తేజ యర్రంశెట్టి, సత్యజిత్ సుగ్గు
సౌండ్ డిజైన్: సింక్ సినిమా
పాటలు: వాసు వలబోజు
కాస్ట్యూమ్స్: అమృత బొమ్మి
ఆర్ట్: లక్ష్మి సింధూజా గ్రంధి
పి.ఆర్.ఒ: వంశీ కాక
లైన్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
కలరిస్ట్: వివేకానంద్
పబ్లిసిటీ డిజైనర్: అనంత్( పద్మ శ్రీ యాడ్స్)
ప్రొడక్షన్ హౌస్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్