Priyanka Art Creations Production No 1 Movie Launch
ప్రియాంక ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెం.1
ప్రియాంక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం కొత్తగూడ దుర్గామాత గుడిలో ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రానికి హీరో భాను చందర్ మొదటి క్లాప్ నివ్వగా తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ లయన్ సాయివెంకట్ కెమెరా స్వచాన్ చేశారు. డైరెక్టర్ వీరభద్రం చౌదరి (పూలరంగడు, అహ నా పెళ్ళంట) ఫేమ్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి డా.పర్వతరెడ్డి, నవీన్ కుమార్‌రెడ్డి, సనారెడ్డి, జనార్ధన్‌రెడ్డి నలుగురు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజశేఖర్ డిఒపి కిట్టు బిఎఫ్ ఎ మ్యూజిక్ః ఉదయ్‌కిరణ్ ఇందులో అతిధులుగా భానుచందర్, లయన్సాయివెంకట్, ఇసి మెంబర్ లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజుగారు, పిఆర్.ఓ ఏలూరు శ్రీను, శ్రీనివాస్‌గౌడ్, మురళి, శేఖర్‌రెడ్డి (ఏడు చేపల కథ ప్రొడ్యూసర్) లక్ష్మీపిక్చర్ అధినేత బాపిరాజు, డైరెక్టర్ః బి. వేణు, హైకోర్ట్ లాయర్ః లక్ష్మీపతి పి.ఆర్.ఓః ఏలూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సుజియ్, మధుప్రియ, నాగేంద్ర సి.హెచ్, వెంకట్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులుః నిర్మాతలుఃడి. పర్వతరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, సన్నారెడ్డి జనార్ధన్‌రెడ్డి డైరెక్టర్ఃరాజశేఖర్.