Ayyappa Kataksham Movie Audio Launch
సుమన్ మొదటి సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ 100 వ సినిమాకి ఆయనతో ఇక్కడ కూర్చున్న – సి.కళ్యాణ్
గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం భాషల్లో నటుడిగా,హీరో గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమన్ తల్వార్
తన 100 వ సినిమా వీర శాస్త్ర అయ్యప్ప కటాక్షం ఆడియో లాంచ్ ప్రసాద్ లాబ్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా నిర్మాతలు లగడపాటి శ్రీధర్,రాజ్ కందుకూరి,సి.కళ్యాణ్ పాల్గొన్నారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ….
నేను 39 సార్లు శబరిమలై వెళ్ళాను,
సుమన్ గారి 100 వ సినిమాకి ట్రైలర్ లంచ్ చేయడం నాకు అయ్యప్ప స్వామి నాకు ఇచ్చిన అదృష్టం,
నేను ఆయన ఫస్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు ఆయనతో కలిసి ఇక్కడ ఉండటం ఆనందంగా ఉంది,
వాళ్ళ అమ్మ గారు సాలరీతో పూర్ స్టూడెంట్స్ ఫీజ్ లు కట్టేవారు,
ఆయనకి ఆమె మంచి వ్యక్తిత్వమే వచ్చింది,ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ,సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ…
సుమన్ గారు 100 వ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది,
డైరెక్టర్ గారు మంచి మ్యూజిక్ అందించారు,
టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ చెబుతూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ
లోపలికి ఎంటర్ అవుతుంటే ఒక గుడిలోనికి వచ్చిన ఫీలింగ్ కలిగింది,
సుమన్ గారు 100 వ సినిమా చేయడం ఆయన అదృష్టం, నేను ఇక్కడికి రావడం నా అదృష్టం.
సుమన్ గారిది మంచి హెల్పింగ్ నేచర్ నేను గౌతమ్ బుద్ధ సినిమా చేస్తున్నప్పుడు ఒక రోల్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే చేసారు,
ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
వి.యస్.పి తెన్నేటి మాట్లాడుతూ
నేను 37 వ సారి ఈ మాలను ధరించాను,
ఈ సినిమా ద్వారా చెప్తున్నా విషయం ఏంటి అంటే శుభం పలకమని,
నేను కథ,స్క్రీన్ ప్లే,మాటలు,పాటలు రాసాను అంటే నాకు రుద్రాభట్ల వేణుగోపాల్ అనే గొప్ప దర్శకుడు ఉండటం వలనే,
నాకు సుమన్ గారితో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది,
నా ఫోన్ లో మై స్వీట్ హీరో అని సుమన్ గారి పేరు ఉంటుంది.
ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.
హీరో సుమన్ మాట్లాడుతూ
ఈ డిసెంబర్ వస్తే సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 సవంత్సరాలు అవుతుంది,
8 భాషల్లో సినిమాలు చేసాను,
తమిళ్ నుంచి నేను తెలుగు సినీ పరిశ్రమకి రావడానికి కారణం నా మిత్రుడు భానుచందర్ ముఖ్య కారణం,
హీరో గా 99 సినిమాలు చేసాను అక్కడితో ఆగింది,
తర్వాత రాఘవేంద్రరావు గారు గంగోత్రి సినిమాలో తండ్రి కేరెక్టర్ ఇచ్చారు,
ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసాను,
నేను హీరోగా 99 సినిమాలు చేయడమే గొప్ప అనుకుంటే ఇప్పుడు 100 వ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.
సుమన్ అయిపోయాడు అనుకున్న ప్రతిసారీ మళ్ళీ బ్యాక్ అయ్యాను అంత ఆ దేవుడి ఆశీర్వదాం,
ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది,సుమన్ 100 వ సినిమా అంటే ఎవరు మర్చిపోరు చాలా విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన సి.కళ్యాణ్ గారికి మిగతా ప్రముఖులుకు కృతజ్ఞతలు.
దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ…..
వి.యస్.పి తెన్నేటి గారు మార్గ దర్శకత్వంలో నేను దర్శకత్వం చేసాను,
తెన్నేటి గారు ప్రజలకు గుర్తుండిపోయే లిరిక్స్ ని అందించారు,
మ్యూజిక్ డైరెక్టర్ వి.యస్.యల్ జయ్ కుమార్ అధ్బుతమైన స్వరాలు అందించారు,
ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ,ఆడియో లంచ్ వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.