Balakrishna condolences to Gollapudi
నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుగారు మనల్ని విడిచి పెట్టి పోవడం చాలా బాధాకరమైన విషయం. నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షక లోకాన్ని మెప్పించారు. ఆయనతో కలిసి చాలా చిత్రాల్లో నటించాను. ఆయన ఓ ఇన్స్టిట్యూట్లాంటి వ్యక్తి. పలు విషయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి. బుల్లితెరపై, సినిమా రంగంలో నటనతో తనదైన ముద్రవేశారు. అలాంటి వ్యక్తి మనకు దూరమవడం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
– నందమూరి బాలకృష్ణ