వాయిదా పడ్డ `సాహో`?
వాయిదా పడ్డ `సాహో`?
`బాహుబలి` సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం `సాహో`. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు చాన్నాళ్ళ క్రితమే నిర్మాణ సంస్థ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం… `సాహో` వాయిదా పడిందని తెలిసింది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్లో ఉండడం… హిందీ వెర్షన్ కి సంబంధించి చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు దొరక్కపోవడంతో… `సాహో` సకాలంలో ప్రేక్షకుల ముందుకు రావడం లేదని సమాచారం. అంతేకాదు… ఆగస్టు 30ని `సాహో` కొత్త విడుదల తేదీగా ఫిక్స్ చేశారని టాక్. అదే గనుక నిజమైతే… `సాహో` మంచి విడుదల తేదిని మిస్ చేసుకున్నట్లే. ఒకట్రెండు రోజుల్లో ఈ వాయిదాపై క్లారిటీ రావచ్చు.