పవన్‌కి వర్కవుట్ కాలేదు.. మరి బన్నీకి?
మెగా కాంపౌండ్ హీరోలకి కలిసొచ్చిన దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అటు పవన్ కళ్యాణ్, ఇటు అల్లు అర్జున్… ఇద్దరికీ కూడా మెమరబుల్ హిట్స్ ఇచ్చాడీ స్టార్ డైరెక్టర్. అంతేకాదు… పవన్, బన్నీ ఇద్దరిని కూడా మూడోసారి డైరెక్ట్ చేసిన తొలి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. అక్కడితో ఆగిపోకుండా… `జల్సా`, `అత్తారింటికి దారేది` వంటి బ్లాక్‌బస్టర్స్ తరువాత పవన్‌తో తను తీసిన మూడో చిత్రం `అజ్ఞాతవాసి` ఏ సీజన్లో విడుదలైందో… అదే సీజన్లో `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి ఘనవిజయాల తరువాత బన్నీతో చేస్తున్న హ్యాట్రిక్ మూవీని కూడా రిలీజ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. మరి… పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌కి హ్యాట్రిక్ ఇవ్వలేకపోయిన సంక్రాంతి సీజన్… బన్నీ – త్రివిక్రమ్ కాంబోకైనా వర్కవుట్ అవుతుందేమో చూద్దాం.