పవన్, బన్నీ, చెర్రీ, వరుణ్ బాటలోనే వెళతాడా?
పవన్, బన్నీ, చెర్రీ, వరుణ్ బాటలోనే వెళతాడా?
`చిత్రలహరి`తో మరోసారి సక్సెస్ట్రాక్లోకి వచ్చేశాడు మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు మారుతి దర్శకత్వంలో `ప్రతీరోజు పండగే` చేస్తున్నాడు. ఇటీవలే పట్టాలెక్కిన ఈ సినిమా సంక్రాంతికి సందడి చేయనుందని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ సీజన్లో సాయితేజ్ సినిమా రిలీజ్ కావడం ఇదే తొలిసారి. సెంటిమెంట్ రీత్యా చూసుకున్నా… సాయికిది కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఎందుకంటే… మెగాకాంపౌండ్లో `సుస్వాగతం`తో పవన్ కళ్యాణ్, `దేశముదురు`తో అల్లు అర్జున్, `నాయక్`తో రామ్చరణ్, `ఎఫ్ 2` వరుణ్ తేజ్ తొలి ప్రయత్నాల్లోనే సంక్రాంతి విజయాలు అందుకున్నారు. మరి… సాయితేజ్ కూడా అదే బాట పడతాడేమో చూద్దాం.