ఈ సారి నాగ్, నాని సినిమాల్లో…
ఈ సారి నాగ్, నాని సినిమాల్లో…
విలక్షణ నటనకు పెట్టింది పేరు సీనియర్ యాక్ట్రస్ లక్ష్మి. హీరోయిన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ పలు వైవిధ్యభరితమైన పాత్రల్లో అలరించింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. కేవలం దక్షిణాదినే కాదు హిందీ చిత్ర పరిశ్రమలోనూ నటిగా తనదైన ముద్ర వేసింది. అలాగే, తన అభినయంతో పలు పురస్కారాలు అందుకుంది లక్ష్మి.
ఇక తాజాగా… `ఓ బేబీ`తో రీ-ఎంట్రీ ఇచ్చి తన నటనతో మురిపించిన లక్ష్మి… త్వరలో మరో రెండు ఆసక్తికరమైన సినిమాలతో పలకరించబోతోంది. ఆ చిత్రాలే… `మన్మథుడు 2`, `గ్యాంగ్ లీడర్`. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ గ్యాప్ లోనే రాబోతున్నాయి. `మన్మథుడు 2` విషయానికి వస్తే.. `నిన్నే పెళ్ళాడతా` తరువాత నాగార్జునకి తల్లిగా లక్ష్మి నటించిన సినిమా ఇది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న తెరపైకి రానుంది. ఇక నాని `గ్యాంగ్‌లీడర్`లోనూ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది లక్ష్మి. ఆగస్టు 30న లేదా సెప్టెంబర్ ప్రథమార్ధంలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. మరి… `ఓ బేబీ` తరహాలోనే ఈ రెండు చిత్రాలకి కూడా లక్ష్మీ ప్లస్ పాయింట్‌గా నిలుస్తుందేమో చూడాలి.