Aadavaallu Meeku Joharlu Pressmeet Photos
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చూసి ఒక చిరునవ్వుతో మంచి సినిమా చూశాం అనే ఫీల్‌తో ఇంటికి వెళ్తారు – హీరో శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకుడు. రష్మిక మందన్న హీరోయిన్. టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. టీజర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచేశారు మేకర్స్. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదలకానుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..
దర్శకుడు కిషోర్ తిరుమల మట్లాడుతూ – “ఈ సినిమా నేను అనుకున్నంత హ్యాపీగా రావడానికి కారణమైన సినిమాలో ఉన్న ఆడవాళ్లందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కథ చెప్పినప్పుడే అందరూ పూర్తి సహాకారం అందిస్తేనే ఈ సినిమా బాగా వస్తుందని నమ్మారు. శర్వా గారు ఈ సినిమా ఫ్లేవర్ ఎక్కడా మిస్‌కాకుండా పూర్తి సహాకారం అందించారు. రష్మిక అంత బీజీ షెడ్యూల్లో కూడా మేం ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేసుకుని షూటింగ్‌కి వచ్చింది. కుష్బుగారి పాత్రలో ఆమెను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేము. రాధికగారి లాంటి ఎక్స్ పీరియన్స్డ్ యాక్టర్‌తో వర్క్ చేయడం చాల హ్యాపీ..ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామీలీ అంతా కలిసి చూసే చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి థ్యాంక్స్. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. టీమ్ అందరికీ థ్యాంక్స్“ అన్నారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ – “శతమానం భవతి తర్వాత మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేయలేదు, అలాగే మహానుభావుడు లాంటి మంచి ఎంటర్టైనర్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. ఆ సినిమాల్లో ఎలా నవ్వించాడో ఆ పాత శర్వా కావాలని చాలా మంది అడుగుతున్నారు. వాళ్లందరికీ ఒకటైతే కచ్చితంగా చెప్పగలను ఈ సినిమా చూసి వెళ్లేటప్పుడు ఒక మంచి చిరునవ్వుతో, ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఇంటికి వెళ్తారు. రాధికగారు, కుష్బుగారి లాంటి యాక్టర్స్‌తో కలిసి నటించడం గర్వంగా ఫీలవుతున్నారు. ఇదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. రష్మికతో కలిసి నటించడం చాలా సరదాగా ఉంటుంది. చాలా డైడికేటెడ్ పర్సన్. ఇంతమంచి అవకాశం ఇచ్చిన నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి థ్యాంక్స్. ముఖ్యంగా దర్శకుడు కిశోర్ తిరుమల ఇలాంటి ఒక బలమైన కథకి ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి టైటిల్ పెట్టడం నిజంగా ప్రశంసనీయం. ఇంత మంచి స్క్రిప్ట్ నా దగ్గరకి తీసుకువచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. చాలా హ్యాపీగా సినిమా తీశాం. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది“ అన్నారు.
రష్మిక మందన్న మట్లాడుతూ – “కిషోర్ గారు ఈ స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నప్పుడే చాలా నవ్వుకున్నాను. సినిమా షూటింగ్ లో కూడా నవ్వుతూనే ఉన్నాం. డబ్బింగ్ సమయంలో కూడా నవ్వుతూనే ఉన్నాం..సినిమా అంతా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి25 కోసం నేను చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా నా ఫేవరేట్ చిత్రాల్లో ఒకటి. ఇంత మంది సీనియర్ యాక్టర్స్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీ..సుధాకర్‌గారు, దేవీశ్రీ, కిషోర్, సుజీత్ గారి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది“అన్నారు.
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ మాట్లాడుతూ – “ముందుగా ఆడవాళ్లు మీకు జోహార్లు టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. మొదటి రోజు నుండి చాలా హ్యాపీగా షూటింగ్ లో పాల్గొనే వాళ్లం. టీమ్ అంతా ఒక యూనిట్లా కూర్చుని ప్రతి సీన్ గురించి మాట్లాడుకుంటూ షూటింగ్ చేశాం. నేను తెలుగులో 250కి పైగా మూవీస్‌లో నటించాను. ప్రతి పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండేలా సినిమా ఉంటుంది. ఫ్యామిలీస్‌తో కలిసి సినిమా చూడండి“ అన్నారు
నటి కుష్బు మాట్లాడుతూ – “ఒక సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్.. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. కుంటుంబ విలువలు, బంధాలు నేపథ్యంలో అద్బుతంగా తెరకెక్కింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు నేను చాలా హ్యాపీ. నా ఫేవరేట్ యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా హ్యాపీ..రష్మిక హానెస్ట్ అండ్ ప్యూర్ సోల్. వెరీ క్యూట్. శర్వా గ్రేట్ పెర్ఫార్మర్. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ శర్వానే.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థ్యాంక్స్“ అన్నారు.
నటి జాన్సి మట్లాడుతూ – “బలమైన క్యారెక్టర్స్ రైటర్స్ మాత్రమే రాయగలరు అని నమ్ముతాను. అన్ని కోణాల నుండి మహిళా క్యారెక్టర్స్‌కి ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్ రాసిన కిశోర్ గారికి థ్యాంక్స్. ఆడవాళ్లు అనగానే సెంటిమెంట్ అనుకుంటారేమో…సిచ్యువేషన్స్ పరంగా వచ్చే కామెడీ.. ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి థ్యాంక్స్“ అన్నారు
నిర్మాత శ్రీకాంత్ మట్లాడుతూ – “` టీమ్ అందరి సపోర్ట్‌తోనే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఫిబ్రవరి 25 ఫ్యామిలీస్‌తో కలిసి సినిమా చూడండి“ అన్నారు.
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు
సాంకేతిక బృందం
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రఫర్: దినేష్
పీఆర్వో: వంశీ-శేఖర్