Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd
Actor Adivi Sesh’s first Pan India film Major is presently in post-production phase. Sesh is closely overseeing the works, since it’s his most ambitious project. From the time, he planned to make a film on the life of 26/11 hero Major Sandeep Unnikrishnan, Sesh has been very attentive about every aspect of the making of Major.
Besides doing the lead role, Sesh has also penned story and screenplay of the movie. Directed by Sashi Kiran Tikka, Major gets a new release date. The movie will grace the cinemas worldwide on June 3rd. The film will have simultaneous release in Telugu, Hindi and Malayalam languages.
Adivi Sesh gives serious gaze in the poster where we can observe injury on his forehead. In the background, Taj Hotel is seen set on fire by terrorists.
Sricharan Pakala scored music and first single Hrudayam fascinated music lovers. The film’s teaser spellbound with its gripping narration and top-notch technicalities.
The multilingual film ‘Major’ traces the journey of Major Sandeep from childhood, teenage, glorious years in the army to the tragic events of the Mumbai attack where he martyred, touching upon the different aspects of his being.
Sobhita Dhulipala, Saiee Manjrekar, Prakash Raj, Revathi and Murli Sharma are the other prominent cast of the film produced by Sony Pictures Films India in association with Mahesh Babu’s GMB Entertainment and A+S Movies.
డైనమిక్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పనులను అడవి శేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు శేష్.
మేజర్ లో అడవి శేష్ కథానాయకుడిగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ‘మేజర్’ కొత్త విడుదల తేదీ ఖరారైయింది. జూన్ 3న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో అడివి శేష్ నుదిటిపై గాయంతో కనిపించగా, తాజ్ హోటల్‌కు ఉగ్రవాదులు నిప్పుపెట్టిన విజువల్ స్టన్నింగా కనిపిస్తుంది.
శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ హృదయం పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంది. మేజర్ టీజర్ గ్రిప్పింగ్ నేరేషన్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో అద్భుతమనిపించింది.
పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ‘మేజర్’లో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు.
శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ తారాగణంగా కనిపించబోతున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మిస్తుంది.