LoveToday Movie Pre Release Function Photos
నవంబర్ 25న రిలీజ్ అవుతున్న ‘లవ్ టుడే’ మూవీ అందరికీ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది : నిర్మాత దిల్ రాజు
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ టుడే’. ఇవాన హీరోయిన్గా నటించింది. తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఫన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమాను నవంబర్ 25న విడుదల చేయటానికి నిర్మాత దిల్‌రాజు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. వంశీ పైడపల్లి, అనీల్ రావిపూడి, రాధికా శరత్ కుమార్ బిగ్ సీడీని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా…
మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. తమిళంలో ఆడియెన్స్ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. కచ్చితంగా తెలుగు ఆడియెన్స్‌కు కూడా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాం.
రాధికా శరత్‌కుమార్ మాట్లాడుతూ ‘‘తెలుగులో లవ్‌టుడే సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళంలో చాలా మంచి విజయాన్ని సాధించిన చిత్రమిది. ముఖ్యంగా యువన్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్ చాలా రోజులుగా నా మైండ్‌లోనే ఉండిపోయింది. ప్రదీప్ రంగనాథన్ తొలిసారి కథ చెప్పగానే సినిమా పెద్ద హిట్ అవుతుందని నేను చెప్పాను. తెలుగు సినిమా మార్కట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా గురించి ఇక్కడ ఉండే అవుట్ లుక్ గొప్పగా ఉంటుందని నేను గర్వంగా చెప్పగలను. తెలుగు ఆడియెన్స్ హీరోలైన చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ వంటి వారిని చూసే తీరు వేరేలా ఉంటుంది. దిల్ ఉండే నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను తీసుకున్నారని తెలియగానే, ఆయనెలా చేస్తారోనని ఆసక్తిగా వెయిట్ చేశాను.
ఇక్కడ మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లను ఎలాగైతే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో, లవ్ టుడే సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ కూడా అలాగే ఆదరిస్తారు. ఈ మూవీలో కంటెంట్ కింగ్. నేను చాలా సంవత్సరాలుగా చాలా మంది నటీనటులతో కలిసి సినిమా చూశాను. చాలా ఏళ్ల తర్వాత థియేటర్లో ఆడియెన్స్ సినిమాను సెలబ్రేట్ చేయటాన్ని నేను గమనించాను. ప్రతీ ఒక్కరూ సబ్జెక్ట్‌కు కనెక్ట్ అవుతున్నారు. సినిమాలో ఫోన్స్ ఎక్సేంజ్ చేసినట్లు చూపించారు. కానీ అసలు విషయం క్యారెక్టర్స్ ఎక్సేంజ్ అనే చెప్పాలి. యువన్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మీలో చాలా మంది మిమ్మల్ని మీరు తెరపై చూసుకుంటారు’’ అన్నారు.
ఏజీఎస్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అర్చన, అసిస్టెంట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఐశ్వర్య మాట్లాడుతూ ‘‘‘లవ్ టుడే’ ఆడియో రిలీజ్ కోసం హైదరాబాద్ రావటం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇది చాలా స్పెషల్ మూవీ. ప్రదీప్ కథ చెప్పగానే పది నిమిషాల్లోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రదీప్ తప్ప మరేవరూ ఈ రోల్లో నటించలేరు. యువన్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. తనకు స్పెషల్ థాంక్స్. రాకింగ్ ఆల్బమ్‌తో పాటు సూపర్బ్ బీజీఎం అందించారు. అమేజింగ్ టీమ్ కుదిరింది. సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. దిల్ రాజుగారికి థాంక్స్. ఆయన సినిమా చూడగానే సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన బొమ్మరిల్లు సినిమాను మేం తమిళంలో నిర్మిస్తే అక్కడే మ్యాజిక్ చేసింది. ఇప్పుడు లవ్ టుడేను ఆయన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
నటి రవీనా మాట్లాడుతూ ‘‘తమిళంలో లవ్ టుడే చాలా పెద్ద హిట్ సాధించింది. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రదీప్‌గారు చాలా మంచి రోల్ ఇచ్చారు. యువన్గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన బీజీఎంతో సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు’’ అన్నారు.
హీరోయిన్ ఇవాన మాట్లాడుతూ ‘‘నాకు నెర్వస్‌గా ఉంటూనే హ్యాపీగా ఉంది. మంచి టీమ్‌తో కలిసి పని చేశాను. ప్రదీప్ రంగనాథన్ అమేజింగ్ పర్సన్. ఏజీఎస్ ప్రొడక్షన్ చాలా మంచి ప్రొడక్షన్ హౌస్. యువన్ శంకర్ సాంగ్స్‌కి డాన్సులు వేసిన నేను, ఇప్పుడు సినిమాలో నటించటం సంతోషంగా ఉంది. రాధిక మేడమ్, సత్యరాజ్‌గారికి ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులకు సినిమాను అందిస్తున్న దిల్‌రాజుగారికి థాంక్స్’’ అన్నారు.
హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ మాట్లాడుతూ ‘‘నేను తెలుగు సినిమాలను చూస్తుంటాను. ఇప్పుడు లవ్ టుడే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. తమిళంలో మేం ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి విజయాన్నే సాధిస్తుందని నమ్ముతున్నాం. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. లవ్ టుడే మూడేళ్ల కష్టం. ఈ మూడేళ్ల ప్రయాణం చాలా కష్టంగా అనిపించింది. కానీ మంచి ఫలితాన్ని అందుకుంది. ఏజీఎస్ సంస్థ తమిళనాడులో పెద్ద నిర్మాణ సంస్థ. తెలుగులో టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజుగారితో కలిసి పని చేయటం ఆనందంగా ఉంది. యువన్ గారు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలకే కాదు.. రీరికార్డింగ్‌కు కూడా ఆడియెన్స్ ఆడి పాడుతున్నారు. సత్యరాజ్‌గారు, రాధికా శరత్‌కుమార్‌గారు, యోగి బాబు కూడా మంచి పాత్రలో మెప్పిస్తారు. మంచి టెక్నీకల్ టీమ్ సినిమా కోసం పని చేసింది. సినిమాలో నేను హీరోను కాదు.. ఆడియెన్సే హీరో. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘‘తమిళనాడులో చిన్న చిత్రంగా విడుదలైన లవ్ టుడే యాబై కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. చాలా గొప్ప విషయం. అన్నీ చోట్ల, అన్నీ సెంటర్స్‌లో ప్రూవ్ చేుకున్న చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్ తమిళంలో విడుదలైనప్పుడు చూశాను. దళపతి విజయ్గారింట్లో సినిమా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేశాను. ఏజీఎస్ మహా లింగంగారితో మాట్లాడాను. సత్యం థియేటర్లో సినిమా చూశాను. అందరూ ఎంటర్టైన్మెంట్తో షేక్ అవుతున్నారు. ఆప్పుడు రీమేక్ చేయాలా వద్దా అని ఆలోచించాను. రీమేక్ చేస్తే మ్యాజిక్ కాదు.. కాబట్టి డబ్ చేయాలని డిసైడ్ అయ్యాను. సినిమా చూసేవారందరూ సినిమాలో ఏదో ఒక పాత్రకు కనెక్ట్ అవుతారు. నవంబర్ 25 మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంది. మీ అందరికీ మూవీ పిచ్చ పిచ్చగా నచ్చుతుంది’’ అన్నారు.
డైరెక్టర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘‘లవ్ టుడే’ సినిమా గురించి నేను వెయిట్ చేస్తున్నాను. తమిళంలో ఈ సినిమా సక్సెస్ గురించి చాలానే విన్నాను. తెలుగులోనూ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. బర్నింగ్ టాపిక్‌మీద సినిమా చేసిన ప్రదీప్ రంగనాథన్, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ గారికి అభినందనలు. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎంటైర్ టీమ్‌కు థాంక్స్’’ అన్నారు.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘యువన్ గారి మ్యూజిక్ గురించి మనకు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎన్ఓ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారాయన. ఏజీఎస్ అర్చన, ఐశ్వర్యలకు తెలుగు ఇండస్ట్రీలో స్వాగతం. ప్రదీప్ రంగనాథన్ తను హిట్ కొట్టడమే కాదు.. కొత్త టీమ్‌ను పరిచయం చేశారు. కొత్తగా ఏదైనా చేయాలనుకునే వారికి ఈ సినిమాలో ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది. ట్రైలర్ చూడగానే బాగా నచ్చేసింది. అందరికీ సినిమా రిలేట్ అయ్యే సినిమా. లవ్ టుడే పెద్ద సెలబ్రేషన్స్లాంటి సినిమా అవుతుంది’’ అన్నారు.