‘నేను లేను’ సక్సెస్ మీట్
‘నేను లేను’ సక్సెస్ మీట్
ఓ.యస్.యం విజన్ – దివ్యాషిక క్రియేషన్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మాతగా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేను లేను`… `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉపశీర్షిక. రామ్ కుమార్ దర్శకుడు. హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్నాధ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 26న విడుదలై మంచి టాక్ తో విజయవంతం గా ప్రదర్శింబడుతోంది. ముఖ్యంగా ఇంతవరకూ రాని న్యూ ఏజ్ కాన్సెప్ట్, ఇంటలెక్చువల్ స్క్రీన్ ప్లే కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో ….
దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ – “మా చిత్రం జులై 26 న విడుదలై అన్ని సెంటర్స్ లోనూ పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. అలాగే మా సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఎక్కడినుండి కాపీ కొట్టలేదు. ఒక జెన్యూన్ పాయింట్ మీద చాలా సంవత్సరాలు కష్టపడి రాసుకున్న స్టోరీ. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ మీద ఏ సినిమా రాలేదు. మా సినిమాకి అటు ఆడియన్స్ ఇటు సినీ విశ్శ్లేషకుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ నిర్మాతలకి బుక్ మై షో కి మధ్యవర్తిగా పనిచేస్తున్న కొందరి వల్ల మా సినిమాకు సరైన రేటింగ్స్ రాలేదు. దాంతో మాకు మల్టిప్లెక్స్ థియేటర్స్ లభించలేదు. దాంతో కొంత సినిమాకు నష్టం జరిగింది. అయినప్పటికీ త్వరలోనే అమెజాన్ లో సినిమా రాబోతుంది” అన్నారు.
హీరో వర్షిత్ మాట్లాడుతూ – ” మా మూవీ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చాలా కొత్త కాన్సెప్ట్ అని నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఇంతరకు ఎవరూ రైజ్ చేయని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. ఇంతమంచి సినిమాలో నన్ను భాగం చేసిన దర్శకుడు రామ్ కుమార్ గారికి థాంక్స్. అలాగే ఆర్.ఆర్, క్లైమాక్స్ ఫైట్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పిన అమౌంట్ ఇవ్వలేదని బుక్ మై షో లో రేటింగ్స్ తగ్గించడం జరిగింది. ఒక చిన్న సినిమాకి ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా మీడియా సపోర్ట్ కావాలి” అన్నారు.
నటుడు వంశీకృష్ణ పాండ్య మాట్లాడుతూ – ” ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాను. సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్ నా పేరు కూడా గుర్తుపెట్టుకొని చాలా బాగా చేశాడు అని చెపుతున్నారు. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడికి థాంక్స్. టెక్నీకల్ గా సినిమా చాలా బాగా వచ్చింది ” అన్నారు.
నటుడు రుద్రప్రకాష్ మాట్లాడుతూ – ” సినిమాలో మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. . సినిమా విడుదలయ్యాక మా ఫ్రెండ్స్ అందరూఫోన్ చేసి అభినందిస్తున్నారు. అలాగే సినిమా రెస్పాన్స్ కూడా బాగుంది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్” అన్నారు.
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం:ఆశ్రిత్, ఛాయాగ్రహణం:ఎ. శ్రీకాంత్ (బి.ఎఫ్.ఎ), నృత్యాలు: జోజో, నిర్వాహణ: సురేష్కూరపాటి, పి.ఆర్.ఓ:సాయి సతీష్ పాలకుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్, ఎస్.ఎఫ్.ఎక్స్:పురుషోత్తం రాజు, ఆడియోగ్రఫీ:రంగరాజ్, కలరిస్ట్ః కళ్యాణ్ ఉప్పాలపాటి, ప్రచార చిత్రాలు: శ్రీక, సహాయదర్శకులు: జె.మోహన్కాంత్, దర్మేంద్ర, సురేశ్, సహనిర్మాత : యషిక, నిర్మాత : సుక్రి , రచన- దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.