Sri Talasani Srinivas Yadav, Hon’ble Minister
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పార్క్ లను ప్రజల భాగస్వామ్యం తో అభివృద్ధి చేయడం, నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Sri Talasani Srinivas Yadav, Hon’ble Minister
బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ముందుగా 18 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన సమోసా పార్క్, మరో 18 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన వెంకటాపురం పార్క్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం న్యూ బోయగూడ లోని హోటల్ అల్ పతా లైన్ లో 9.65 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్, బోయగూడ లోని బర్ల బాలయ్య దొడ్డి వద్ద 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్, న్యూ బోయగూడ లో 9.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్, న్యూ బోయగూడ లో రైల్వే బ్రిడ్జి వెనుక 9.80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్, భోలక్ పూర్ లోని విక్టరీ అపార్ట్ మెంట్ వద్ద 9.85 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ప్రజల అవసరాల నిమిత్తం నిర్మించిన పార్క్ లను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. చిన్న చిన్న వేడుకలు, పండుగలను కాలనీవాసులు అందరు కలిసి పార్క్ లో నిర్వహించుకోవడం వలన కాలనీ వాసుల మద్య ఐక్యత మరింత బలపడుతుందని, కాలనీని మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశాలు ఉంటాయని వివరించారు. వెంకటాపురం పార్క్ పక్కన శిధిలావస్థలో ఉన్న కమిటీ హాల్ స్థానంలో నూతన భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఎంతో అద్బుతంగా పార్క్ ను అబివృద్ది చేసి ఇవ్వడం పట్ల కాలనీ ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజల అవసరాలను తెలుసుకొని పరిష్కరిస్తున్నామని చెప్పారు. గడిచిన 8 సంవత్సరాల లో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని, అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. అన్ని కాలనీలు, బస్తీలలో సీవరేజ్, వాటర్ లైన్, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పద్మారావు నగర్ BRS పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, EE సుదర్శన్, వాటర్ వర్క్స్ GM రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ACP క్రిస్టోఫర్, శానిటేషన్ DE శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.