Top gear movie producer kv sridhar reddy pics
కంటెంట్ మీదున్న నమ్మకంతోనే సినిమాను తీశాం.. టాప్ గేర్ ప్రమోషన్స్‌లో నిర్మాత శ్రీధర్ రెడ్డి
యంగ్ అండ్ లవ్లీ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం ‘టాప్ గేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రాం శ్రీధర్ రెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు కె. శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా నిర్మాత శ్రీధర్ రెడ్డి గురువారం నాడు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..
*టాప్ గేర్ సినిమా ఎలా ఉండబోతోంది?*
టాప్ గేర్ సినిమా చాలా బాగుండబోతోంది. ఈ సినిమాతో ఆదికి వచ్చే ఏడాది శుభారంభం కానుంది. ఆది మంచి డ్యాన్సర్. మంచి నటుడు. టాప్ గేర్ సినిమాతో వచ్చే ఏడాది ఆయన దశ మారుతుంది.
*టాప్ గేర్ సినిమాలో మీకు ఏ పాయింట్ నచ్చింది?*
మనం కథ విన్నప్పుడు అది మనల్ని హాంట్ చేయాలి. శశికాంత్ ఈ కథ చెప్పిన తరువాత నాకు చాలా నచ్చింది. ఈ కథ విన్న తరువాత ఆది అయితే బాగుంటుందని మేం అనుకున్నాం. వెళ్లి కథ చెప్పాం. ఆయన ఓకే అన్నారు.
*టాప్ గేర్ సినిమా కోసం డైరెక్టర్ చేసిన వర్క్ ఎలా అనిపించింది?*
టాప్ గేర్ సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా సినిమాను తీశారు.
*హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్ఆర్ గురించి చెప్పండి?*
టాప్ గేర్ సినిమాకు అసలు హీరో ఆయనే. ఇలాంటి సినిమాలకు హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్ఆర్ ప్లస్ అవుతుంది.
*టాప్ గేర్ సినిమాకు బడ్జెట్ పెరిగిందా?*
ముందు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త పెరిగింది. క్వాలిటీ కోసమే ఖర్చు పెట్టాం. సినిమాను చూశాక ఆడియెన్స్ కూడా అదే మాట చెబుతారు. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే సినిమాను తీశాం. నాకున్న పరిచయాలతో సినిమాను సేఫ్ ప్రాజెక్ట్‌గా మార్చగలను.
*టాప్ గేర్ కథ ఏంటి?*
క్యాబ్ డ్రైవర్లకు కస్టమర్లతో కూడా సమస్యలు వస్తుంటాయి. అలా అనుకోకుండా హీరో ఓ సమస్యలో చిక్కకుంటాడు. దాన్నుంచి ఎలా బయటపడతాడు అనేది కథ. తన భార్యను కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు బాగుంటాయి.
*ప్రస్తుతం నిర్మాతలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి?*
ప్రతీది నిర్మాతకు చాలెంజింగ్గానే ఉంటుంది. సినిమాను ప్రారంభించడం, పూర్తి చేయడం, రిలీజ్ చేయడం అన్నీ సవాళ్లే. మనకు సినిమాలంటే ఇష్టం, ప్యాషన్ కాబట్టి చేస్తుంటాం. వాటిని ఎదుర్కోగలను అనే ధైర్యం ఉంటేనే ఇందులోకి రావాలి. మా సినిమా అద్భుతంగా వచ్చింది. మా చిత్రం మీద నాకు నమ్మకం ఉంది.
*టాప్ గేర్ సినిమాను చూశాక సాయి కుమార్ రియాక్షన్ ఏంటి?*
ఆదికి 2023 చాలా బాగుండబోతోందని, టాప్ గేర్ సినిమాతో అది ప్రారంభం అవుతుందని సాయి కుమార్ గారు చెప్పుకొచ్చారు. టాప్ గేర్ సినిమా పట్ల ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
Aadi Is A Good Actor and Dancer, Top Gear Welcomes 2023 With A Bang: Producer KV Sridhar Reddy
Young and promising hero Aadi Saikumar’s action thriller TOP Gear is due for release tomorrow. The film was directed by Shashikanth, while Aditya Movies & Entertainments is presenting it. The film’s producer K. V. Sridhar Reddy of Sri Dhanalakshmi Productions interacted with media to make some interesting revelations about the movie.
*How did the movie Top Gear come out?*
The movie has come out well. It will welcome 2023 on a bang. We didn’t compromise in making. In fact, the budget increased by 20% because of the quality. DOP Sai Sreeram’s work is exceptional. Editor Prawin Pudi cut the movie sharply. Coming to Aadi, he is a good performer, a good dancer, and has done stunning stunts for the movie.
*What are the parameters for you to select a story?*
The story needs to haunt us. When Shashi narrated the story, I liked it immediately. You will appreciate the movie when you watch it. Top Gear will bring a good name for me as a producer.
*What are the core elements?*
Content-based movies are doing well of late. Likewise, Top Gear is also a content-rich movie. The screenplay is engaging all through. It’s an action thriller. It has the backdrop of drugs. It makes you guess what’s going to happen next. Top technicians have worked for the movie. Harshavardhan Rameshwar’s RR is excellent. AS per the demand of the story, the film has only one song.
*What’s the movie all about?*
The villain gives a task to the hero who needs to switch to Top Gear. How the hero comes out of the problem forms the crux of the story. In the process, the villain targets the hero’s wife as well. Riya Suman did a wonderful job.
*Tells us about your association with Aditya Entertainments?*
Aditya Entertainment gave us big support. My next film will also be in association with them. We are in discussions with 2 heroes for our next.
*What did you feel after watching the first copy? What did Saikumar say?*
Saikumar is very happy with the movie. We too are confident about the outcome.
*How many theatres will Top Gear be released in?*
We’re releasing the movie in around 300 screens in Telugu states.