Actors
-
Viva Harsha Matti Kusthi Movie interview Photos
‘మట్టి కుస్తీ’ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : హీరో విష్ణు విశాల్ ఇంటర్వ్యూ హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయిక. ‘ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో హీరో విష్ణు విశాల్ చిత్ర విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు. ‘మట్టి కుస్తీ’ గురించి చెప్పండి ? ‘మట్టి కుస్తీ’ భార్యా భర్తల ప్రేమ కథ. భార్యాభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కథలో కుస్తీ స్పోర్ట్ కూడా భాగంగా వుంటుంది. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ వుంది. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం. పెళ్లి తర్వాత భార్యాభర్తలకు కొన్ని అంచనాలు వుంటాయి. ఆ అంచనాలని అందుకోలేనప్పుడు ఇగోలు మొదలౌతాయి. మట్టికుస్తీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. స్పోర్ట్స్ కూడా లైట్ హార్టెడ్ గా వుంటుంది. సినిమా చాలా వినోదాత్మకంగా వుంటుంది. ‘మట్టి కుస్తీ’లో నా కెరీర్ లో మొదటి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మసాల ఫిల్మ్. స్పోర్ట్ 20 నిమిషాలే ఉంటుందా ? ఇందులో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వుంటాయి. స్పోర్ట్ ఇరవై నిమిషాల కంటే ఎక్కువే వుంటుంది. ఇందులో నేను కబడ్డీ ప్లేయర్ ని. కానీ కుస్తీ ఆటకి వెళ్తాను. అలా ఎందుకు వెళ్ళాల్సివచ్చిందో.. సినిమా చూసినప్పుడు ఇది చాలా సర్ ప్రైజింగా వుంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా వుంటాయి. ట్రైలర్ లో ” వెయ్యి అబద్దాలాడైన ఒక పెళ్లి చేయమని చెప్పారు. కానీ రెండు అబద్దాలు ఆడి ఈ పెళ్లి చేశాం’ అని డైలాగ్ వుంటుంది. ఆ రెండు అబద్దాలు ఏమిటనేది మీకు సినిమా చూసినప్పుడే తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కట్ చేయడం నా కెరీర్ లో పెద్ద సవాల్ గా అనిపించింది. సర్ ప్రైజ్ రివిల్ చేయకుండ కంటెంట్ ని చెప్పడం ఒక చాలెంజ్. ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ విడుదల చేయడం వరకూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఫస్ట్ లుక్ చూస్తే ఇది స్పోర్ట్ మూవీ అనిపించింది. తర్వాత ఒకొక్కటిగా రివిల్ చేస్తూ ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచి థియేటర్లో చూడాలనే ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశాం. భార్యా భర్తల నేపధ్యం అంటే హాస్యానికి కూడా అవకాశం వుంటుంది కదా ? మట్టికుస్తీలో కూడా చాలా కామెడీ వుంది. ఒక రిలేషన్ షిప్ లో వున్నపుడు ఖచ్చితంగా ఇగో వుంటుంది. అయితే ఇందులో ఆడ మగ సమానమని చెప్పే సందేశం కూడా వుంది. అయితే దిన్ని ఒక సందేశం గా కాకుండా వినోదాత్మకంగా చెప్పాం. మహిళా ప్రేక్షకులు కూడా మట్టికుస్తీని చాలా ఇష్టపడతారు. మట్టికుస్తీ నటీనటులు గురించి ? మునిష్ కాంత్, కరుణ, కింగ్స్లి పాత్రలు వినోదాత్మకంగా వుంటాయి. తెలుగు నటులు అజయ్ గారు విలన్ గా చేశారు. శత్రు గారు మరో నెగిటివ్ పాత్రలో కనిపిస్తారు. రవితేజ గారు ఈ ప్రొజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? ‘ఎఫ్ఐఆర్’ సినిమాని తెలుగులో విడుదల చేసే సమయంలో ఒక ఫ్యామిలీ ఫ్రండ్ ద్వారా రవితేజ గారిని కలిశాను. నేను చేసే సినిమాలు రవితేజ గారికి చాలా నచ్చాయి. ఎఫ్ఐఆర్ ట్రైలర్ ఆయనకి చాలా నచ్చింది. ఆ సినిమాని ప్రజంట్ చేశారు. ఆ సమయంలోనే తర్వాత ఏం చేస్తున్నావని అడిగారు. అప్పుడు ఈ లైన్ చెప్పాను. అది వినగానే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రోడ్యుస్ చేస్తానని చెప్పారు. అలా జర్నీ మొదలైయింది. రవితేజ గారు నన్ను ఎంతో నమ్మారు. 13 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో వున్నాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి ఎవరినైనా కలిస్తే నా బిజినెస్, మార్కెట్ గురించి మాట్లాడేవారు. కానీ రవితేజ గారు ఒక్క మీటింగ్ లో నన్ను సంపూర్ణంగా నమ్మారు. ఆయన నమ్మకం నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆయనకి నా ... -
Hollywood Action Touch For Sudheer Babu Hunt
సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ‘హంట్’కు హాలీవుడ్ యాక్షన్ టచ్ – – – – – – – – – – – – – ... -
Du Du Song Promo Release from Dhamaka
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల, త్రినాధరావు నక్కిన, టిజి విశ్వప్రసాద్ “ధమాకా” నుండి డు డు సాంగ్ ప్రోమో రిలీజ్, నవంబర్ 25న పాట విడుదల మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ధమాకా నుండి డు డు సాంగ్ ని నవంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇటివలే ప్రకటించిన టీం తాజాగా ప్రోమోని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో మరో డ్యాన్సింగ్ నెంబర్ గా డు డు పాటని కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతోంది. ప్రోమోలో రవితేజ చేసిన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్ పాటపై అంచనాలని పెంచింది. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, పృధ్వీ చంద్ర ఆలపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ-శేఖర్ -
Veera Simha Reddys First Single Jai Balayya On Nov 25th
Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy’s First Single Jai Balayya On Nov 25thNatasimha Nandamuri Balakrishna’s mass action entertainer Veera Simha ... -
Naga Chaitanya Custody Movie first look
NC 22 titled “CUSTODY”, Naga Chaitanya fighting against all odds in the first look Akkineni Naga Chaitanya’s Telugu-Tamil bilingual project under the direction of ... -
47 Glorious Years for Dr. M Mohan Babu
వెండితెరపై ‘కలెక్షన్ కింగ్’ నట ప్రస్థానానికి 47 వసంతాలు కొందరి ప్రస్థానం విన్నా, చదివినా మన జీవితానికి సరిపడ ప్రోత్సాహం లభిస్తుంది. ఓ సామాన్య వ్యక్తి నుండి అసమాన్య ... -
SIR Release Date Matter Design Stills
ధనుష్ ‘సార్’ 17 ఫిబ్రవరి, 2023 న విడుదల *ఆకట్టకుంటున్న విడుదల తేదీ ప్రచార చిత్రం ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక ...